మేషం
ముఖ్య కార్యాలలో ఆటంకాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆదాయం లభించినా ఖర్చులు పెరుగుతాయి. సహచరులతో కొన్ని సమస్యలు. ప్రయాణాలు చివరిక్షణంలో వాయిదా. కష్టానికి ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు. వ్యాపారస్తుల యత్నాలు నిదానిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, కొంత చికాకు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం.
వృషభం
ప్రతిభను చాటుకునేందుకు చేసే యత్నాలు సఫలం. ముఖ్య కార్యాలను చక్కదిద్దడంలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆదాయానికి ఇబ్బందులు ఉండవు. సమయానుసారం నిర్ణయాలు తీసుకుని కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దేవాలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి.
మిథునం
చేపట్టిన కార్యాలు కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. రుణబాధలు తొలగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. చిరకాల స్నేహితులను కలుసుకుని మనస్సులోని భావాలను పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగస్తులకు సమస్యలు తీరతాయి. సాంకేతిక నిపుణులకు అనుకూలం.
కర్కాటకం
అనుకున్న కార్యాల్లో ఆటంకాలు తొలగుతాయి. రాబడి మెరుగ్గా ఉంటుంది. బంధువులతో తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల చిక్కులు అధిగమిస్తారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. పేరుప్రతిష్ఠలు పొందుతారు. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు లాభాలు దక్కుతాయి.
సింహం
ఉత్సాహంతో ఎంతటి కార్యాన్నైనా సాధిస్తారు. దూరమైన మిత్రులు దగ్గరవుతారు. కుటుంబ సభ్యుల ఆప్యాయతను పొందుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు లాభాలు. ఉద్యోగస్తులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయ వేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు అంచనాలు నిజమవుతాయి.
కన్య
కొన్ని వ్యవహారాల్లో క్రియాశీల పాత్ర పోషించి విజయం సాధిస్తారు. అపురూపమైన వస్తువులు సేకరిస్తారు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు చేస్తారు. ఆస్తుల వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఉద్యోగులకు పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతమైన కాలం.
తుల
మీ వ్యతిరేకుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనుకున్న కార్యాలు నిదానిస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వాహనాల కొనుగోలు వాయిదా. మీ ఆలోచనలు కుటుంబసభ్యులకు నచ్చవు. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. సోదరులు, స్నేహితులతో విభేదాలు. వ్యాపారస్తులకు అవాంతరాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, పరిశోధకులకు కొన్ని చికాకులు ఎదురుకావచ్చు.
వృశ్చికం
ఎంతటి పరిస్థితి ఎదురైనా తట్టుకుంటారు. ముఖ్య కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో మీ మాటకు ఎదురుండదు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనస్సులోని భావాలను ఆప్తులతో పంచుకుంటారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కే సూచనలు. ఇంటి నిర్మాణాలు తిరిగి ప్రారంభిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు, కళాకారులకు యత్నకార్యసిద్ధి.
ధనుస్సు
ఇంతకాలం పడిన కష్టం ఫలించి ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో కార్యక్రమాలు పూర్తి. అనుకున్న రాబడి దక్కుతుంది. వివాహాది వేడుకలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తుల ఒప్పందాలలో అంగీకారానికి వస్తారు. వ్యాపారస్తులు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు దక్కుతాయి. వారాంతంలో సన్నిహితులతో వివాదాలు.
మకరం
కొత్త కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వాహనసౌఖ్యం. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. కుటుంబంలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు లాభాలు. ఉద్యోగులకు అనుకూలం. వారారంభంలో ఖర్చులు. దూరప్రయాణాలు. శారీరక రుగ్మతలు.
కుంభం
దీర్ఘకాలిక రుణబాధలు తొలగిపోతాయి. చేపట్టిన కార్యాలు పూర్తి చేసే వరకూ విశ్రమించరు. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు లాభాలు. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది. పరిశోధకులు, క్రీడాకారులకు అనుకూలమైన సమయం. వారారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం.
మీనం
కొన్ని కార్యక్రమాలు విజయవంతం. ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలం. వ్యాపారస్తులకు లాభాలు. ఉద్యోగులకు అనుకూలస్థితి. కళాకారులు, క్రీడాకారులు సమస్యలను అధిగమిస్తారు.