జ్యోతిష్యం: ఫిబ్రవరి 13న ... గురుడు.. ధనిష్టా నక్షత్రంలోకి ప్రవేశం.. మూడు రాశుల వారి దశ తిరుగుతుంది

జ్యోతిష్యం:   ఫిబ్రవరి 13న ... గురుడు.. ధనిష్టా నక్షత్రంలోకి ప్రవేశం.. మూడు రాశుల వారి దశ తిరుగుతుంది

జ్యోతిష్య శాస్త్రం ప్రకాకం... దేవ గురువు గురుడు .. ఫిబ్రవరి 13న  ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు.  అప్పటి వరకు శ్రవణం లో ఉన్న గురుడు .. ధనిష్టా నక్షత్రంలో సంచారం చేయడంతో  మూడు రాశుల వారికి అదృష్టం వారికి కలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. సింహరాశి.. తులారాశి... మీన రాశి కి చెందిన వారు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇప్పుడు ఆ రాశుల వివరాల గురించి తెలుసుకుందాం. . .

సింహరాశి:  ఈ రాశి వారికి గురుడు... ధనిష్టా నక్షత్రంలో సంచరించే సయమంలో అన్నీ విధాలా అనుకూలంగా ఉంటుంది.  వ్యాపారస్తులు అధికలాభాలు పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.  ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొత్త అవకాశాలు లభిస్తాయి.  ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పని నెరవేరడంతో అంతులేని ఆనందాన్ని పొందుతారు.  ఆర్థికంగా బలపడటమే కాకుండా.. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యల ఇబ్బందుల నుండి బయటపడతారు.  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

ALSO READ | Astrology: ఫిబ్రవరి 11న కుంభరాశిలో బుధుడు .. శని కలయిక .. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..

తులా రాశి:  ధనిష్టా నక్షత్రంలో గురుడు ప్రవేశించడంతో ఈ రాశి వారి జాతకం పూర్తిగా మారిపోతుంది. చేతి వృత్తుల వారికి ఊహించని ఆర్డర్లు వస్తాయి.  ఉద్యోగస్తులు అధికారులనుంచి అవార్డులు అందుకోవడమే కాకుండా.. బిగ్​ ఆఫర్​ వచ్చే వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు  చెబుతున్నారు. వృత్తి .. వ్యాపారస్తులకు .. చెందిన వారికి అనుకోని లాభాలు పొందుతారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాలు ,వ్యాపారాలలో పురోగతికి కొత్త మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. 

మీన రాశి: ఈ రాశి వారికి  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి.  కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.  మీరు తీసుకునే నిర్ణయాలు .. లైఫ్​ కు  టర్నింగ్​ పాయింట్​ అవుతాయి.  ఆరోగ్యం కూడా బాగుంటుంది. మానసిక ప్రశాంతత అలాగే ఉంటుంది.