
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సంపదను కలుగజేస్తాడు. జాతక రీత్యా వ్యక్తి జాతకంలో శుక్రుడు అనుకూలించినప్పడు వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి శుక్రుడు స్థానం మారినప్పుడు 12 రాశుల వారి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. మార్చి 23న శుక్రుడు మీనరాశిలో ఉదయించనున్నాడు. దీనివలన కొన్నిరాశుల వారు అప్రమత్తంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలుండగా ఓ మూడు ( వృషభ, మకర, కుంభ) రాశుల వారికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. మీనరాశిలో శుక్రుడు ఉదయించడం వలన జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. . . . .
మేష రాశి: శుక్రుడు మీనరాశిలో ఉదయించడం వలన మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఎలాంటి నిర్ణయం తొందరపడి తీసుకోవద్దని చెబుతున్నారు. వృత్తి.. ఉద్యోగంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా చివరకు అంతా మంచే జరుగుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. నిరుద్యోగులు జాబ్ కోసం కొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: శుక్రుడు మీనరాశిలో ఉదయించడం వలన వృషభ రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారస్తులకు అనుకోని విధంగా లాభాలు వస్తాయి. కార్యాలయంలో సముచిత స్థానం లభిస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
మిథున రాశి: మీన రాశిలో శుక్రుడు ఉదయించడం వలన ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో ఆందోళనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులు ట్రాన్సఫర్ అయ్యే అవకాశాలున్నాయి. అనవసరంగా మాట పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. కొన్నిఅనవసర ఖర్చులు రావడంతో ఆర్ధికంగా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితోను ఎలాంటి వాదనలకు దిగవద్దు. కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి: మీనరాశిలో .. శుక్రుడు ఉదయించడం వలన ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగే అవకాశం ఉంది. అయినా కొంత వరకు సంతృప్తిగానే ఉంటుంది. ఒక్కోసారి ఉన్నతాధికారులతో మాట పడాల్సి వస్తుంది. అయిన బాధ పడకండి.. తరువాత వాళ్లే రియలైజ్ అవుతారు. తల్లి దండ్రుల ఆరోగ్య విషయంలో కొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ప్రతి విషయంలో కూడా కొంత ఆందోళకర పరిస్థితులు ఉన్నా.. చివరకు అంతా మంచే జరుగుతుంది. మొత్తంగా పరిశీలిస్తే జ్యోతిష్య నిపుణుల ప్రకారం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయని చెబుతున్నారు.
సింహ రాశి: మీనరాశిలో శుక్రుడు ఉదయించడం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. అనుకోకుండా కొన్ని ఇబ్బందులు.. చికాకులు ఏర్పడటం వలన కొంత అసహనంగా ఉంటారు. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నిస్తారు. నిరుద్యోగులకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు లాభాలు తక్కువుగా ఉంటాయి. జీర్ణ క్రియ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల జోలికి అసలు వెళ్లవద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
కన్యారాశి: ఈ రాశి వారికి శుక్రుడు మీనరాశిలో ఉదయించడం వలన విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అన్ని విధాలా కలసి వస్తుంది. పెళ్లి వ్యవహారంలో ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కొత్త గా పెట్టేబడులు పెట్టవద్దు. చెప్పుడు మాటలు విని ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. సమస్యలను సామర్యసంగా పరిష్కరించుకోండి. ఉద్యోగస్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంతా మంచే జరుగుతుంది. డబ్బు ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి.
తులారాశి: ఈ రాశి వారికి శుక్రుడు మీనరాశిలో ఉదయించడం వలన మిశ్రమ ఫలితాలుంటాయి. కొద్దిగా కష్టపడితే ఎలాంటి పని అయినా విజయం సాధించవచ్చు. కేరీర్ పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులు.. వ్యాపారస్తులు కష్టపడాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాన్ని వాయిదా వేయండి. పెళ్లి ప్రయత్నాలు కలసి వస్తాయి. పూర్వీకుల ఆస్తి విషయంలో కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
వృశ్చికరాశి: శుక్రుడు మీనరాశిలో ఉదయించడం వలన ఈ రాశి వారు కెరీర్ విషయంలో కొంత ఆందోళన పడతారు. ఆలస్యంగా మీరు చేపట్టిన పనులు పూర్తవుతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులు.. వ్యాపారస్తులు అదనంగా కష్టపడాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో నిర్ణయం తీసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు కొన్ని విషయాల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. ఓర్పు.. సహనం పాటించండి.. చివరకు అంతా మంచే జరుగుతుంది.
ధనుస్సు రాశి: మీనరాశిలో శుక్రుడు ఉదయించడం వలన ఈ రాశి వారు అప్పులు చేయాల్సి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులు పనిభారంతో ఇబ్బంది పడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు దూర ప్రాంతానికి బదిలీ అవుతారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.వ్యాపారస్తులకు లాభాలు తక్కువుగా ఉంటాయి. నిరుద్యోగులకు అతి కష్టం మీద జాబ్ లభిస్తుంది.
మకర రాశి : శుక్రుడు మీన రాశిలో ఉదయించడం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. కెరీర్ పరంగా మార్పులు వస్తాయి. మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారానికి కొత్త అవకాశాలు సృష్టించబడతాయి. ఇది మంచి ఆర్థిక లాభాలను కూడా ఇస్తుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి.
కుంభ రాశి: మీనరాశిలో శుక్రుడి ఉదయించడం వల్ల ఈ రాశి వారు అద్భుత లాభాలను పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్.. జీతం పెరుగుదల ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి అధిక లాభాలు పొందుతారు. ఉన్నత స్థానంలో ఉండాలనే మీ కోరిక నెరవేరుతుంది. . కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు పెరుగుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేందుకు ఇది అనుకూలమైన సమయం. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మీన రాశి : ఇదే రాశిలో శుక్రుడు ఉదయించడం వల్ల కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. ఉద్యోగంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. ప్లాన్ ప్రకారం పని చేసుకోండి అంతా మంచే జరుగుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణంలో నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టం జరిగి, తర్వాత ఆందోళన చెందుతారు. వ్యాపారస్తులకు లాభం లేకపోయినా నష్టం ఉండదు . ఎట్టి పరిస్థితులో కొత్త పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు.