ఓయూ, వెలుగు: హ్యూమన్ జీనోమ్ బ్యాకప్ కోసం ఆల్టర్నేట్ కనుగొనాలని అంతరిక్ష తొలి భారతీయ వ్యోమగామి, రిటైర్డ్ వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ సైంటిస్టులకు సూచించారు. గ్రహశకలాలు భూమిని ఢీకొన్నప్పుడు డైనోసర్లు, పెద్ద బల్లులు అంతరించిపోయాయని చెప్పారు. వాటిని బ్యాకప్ చేయడానికి జన్యువులు ఉన్నట్లయితే అలా జరిగేది కాదన్నారు.
హ్యూమన్ జీనోమ్‌కు బ్యాకప్‌లు లేనందున మానవాళి పరిస్థితి వాటిలా మారే ప్రమాదం ఉందన్నారు. బుధవారం ఓయూలోని ఠాగూర్ఆడిటోరియంలో నిర్వహించిన ఉస్మానియా తక్ష్ -2023 ముగింపు ఉత్సవాల్లో రాకేశ్‌శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..ఫెయిల్యూర్‌కు భయపడొద్దని, గ్లోబల్ ఎకానమీకి ఆజ్యం పోసేందుకు, వనరులు అన్వేషించడానికి అంతరిక్ష యాత్రలు ఉపయోగపడతాయన్నారు. చంద్రుడు, ఇతర గ్రహాలపై జీవించేందుకు అన్వేషించే ముందు భూమికి నష్టం చేయవద్దన్నారు.