వచ్చే ఏడాదిలోనే భూమికి సునీత..మరో ఐదారు నెలలు రోదసిలోనే

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్  వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బారీ విల్ మోర్  మరో ఐదారు నెలలు అంతరిక్షంలోనే ఉండనున్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో వారు తిరిగి భూమికి చేరుకునే అవకాశం ఉంది. బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్  స్పేస్ క్రాఫ్ట్ లో ఆ ఇద్దరు ఆస్ట్రోనాట్లు ఓ మిషన్  కోసం ఈ ఏడాదిలో జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లారు.

 8 రోజుల పాటు ఐఎస్ఎస్ లో ఉండి తిరిగి భూమికి రావాల్సి ఉండగా స్టార్ లైనర్  స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ ఇద్దరు అక్కడే చిక్కుకుపోయారు. వారు స్పేస్ లోకి వెళ్లి ఇప్పటికి 80 రోజులైంది. దీంతో ప్రత్యమ్నాయ మార్గాలు ఏర్పాటుచేసి వారిని తిరిగి భూమికి తీసుకురావాలని నాసా సైంటిస్టులు భావించారు. శనివారం సైంటిస్టులు సమావేశం నిర్వహించారు. సునీత, బారీని స్పేస్ ఎక్స్  వెహికల్ లో తిరిగి భూమికి తీసుకురావాలని నిర్ణయించారు.