Asus తన కొత్త Cromebook CM 14 ల్యాప్టాప్ను భారత్లో విడుదల చేసింది. Asus మిడ్ రేంజ్ ఫోన్ ధరలో కొత్త ల్యాప్టాప్ను అందిస్తోంది. ఈ ల్యాప్టాప్లో 180 డిగ్రీల లేఫ్లాట్ కీలు, 14 అంగుళాల డిస్ ప్లే, అంతరాయం లేని కనెక్టివిటీ కోసం Wi-Fi6తో బ్యూటీఫుల్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ లో 15 గంటల బ్యాటరీ జీవితాన్ని కూడా పొందుతారు. Asus Chromebook CM14 ని అమెజాన్ నుంచి రూ. 26,990 కి కొనుగోలు చేయొచ్చు. ఇది గ్రావిటీ గ్రే కలర్ ఆప్షన్ లో లభిస్తోంది.
Asus Chromebook CM14 ప్రత్యేకతలు
ఈ Chromebook సొగసైన డిజైన్ తో రూపొందించారు. దీనం మందం 18.3 mm ఇది 250nits పీక్ బ్రైట్ నెస్, 1920x1080(ఫుల్ HD+పిక్సెల్ లతో 14 అంగుళాల LED బ్యాక్ లిట్ యాంటీ గ్లేర్ డిస్ ప్లే తో వస్తుంది.
ఈ ల్యాప్ టాప్ ARM Mali -G52 MC2 GPU గ్రాఫిక్ లతో కూడిన Media Tek Kompanio 520 ప్రాసెసర్ ని కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 8GB LPDDR4X RAM.. 128 GB eMMC 5.1 స్టోరేజీని కలిగి ఉంటుంది. ఆడియో కోసం ఈ ల్యాప్ టాప్ లో ఇన్ బిల్ట్ స్పీకర్స్, కంబైన్డ్ హెడ్ ఫోన్ /మైక్రోఫోన్ జాక్ ఉంటుంది.
Asus Chromebook CM14 ల్యాప్ టాప్ Crome OS లో రన్ అవుతుంది. 42 WHrs, 2S1P, 2 -సెల్ Li-lon బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 15 గంటల పాటు ఆపరేట్ చేయొచ్చు. ఇది కాకుండా కస్టమర్లు ల్యాప్ టాప్ లో ఇన్ బిల్ట్ వెబ్ క్యామ్ పొందవచ్చు.