
హైదరాబాద్, వెలుగు: అసుస్ ఇండియా, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ (రోగ్) ల్యాప్‌టాప్‌ల రెండో స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. దాదాపు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ స్టోర్‌లో నోట్‌బుక్‌లు, రోగ్ పీసీలు, ల్యాప్‌టాప్‌లు, ఆల్-ఇన్ -వన్ పీసీలు, యాక్సెసరీస్ క్రియేటర్ సిరీస్‌ల కంప్యూటర్లు ఉంటాయి. గేమర్స్ కమ్యూనిటీ కోసం ఒక ఎక్స్పీరియన్స్ జోన్‌ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ జిగ్నేష్ భావ్‌సర్ మాట్లాడుతూ తాము టైర్ 1 నగరాలతోపాటు టైర్ 2, టైర్ 3 నగరాల్లోనూ స్టోర్లను తెరుస్తామని చెప్పారు.