అల్లిగూడెం గ్రామంలో కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి

అశ్వారావుపేట, వెలుగు : కోడిపందేల స్థావరంపై అశ్వారావుపేట పోలీసులు బుధవారం దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై శ్రీరాముల శ్రీను తెలిపిన వివరాలు ప్రకారం..  మండలంలోని అల్లిగూడెం గ్రామ సమీపంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 

ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు పందెం కోళ్లు, రెండు ద్విచక్ర వాహనాలు, రూ.4,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.