బీవైడీ మార్కెట్​ క్యాప్​​@ రూ.14.37 లక్షల కోట్లు

బీవైడీ మార్కెట్​ క్యాప్​​@ రూ.14.37 లక్షల కోట్లు
  • ఇండియాలోని టాప్​–5 ఆటో కంపెనీల మొత్తం వాల్యూ​ కంటే ఎక్కువ

న్యూఢిల్లీ: చైనీస్​ ఎలక్ట్రిక్​ వెహికల్ ​కంపెనీ బీవైడీ షేర్లు ఈ ఏడాది ఏకంగా 40 శాతం పెరగడంతో దీని మార్కెట్​క్యాప్ 165.7 బిలియన్​ డాలర్లకు (దాదాపు రూ.14.37 లక్షల కోట్లకు) దూసుకెళ్లింది. ఇది మనదేశంలోని టాప్​–5 ఆటోమొబైల్​ కంపెనీల ఉమ్మడి విలువ కంటే ఎక్కువ! ఈవీలను ఐదు నిమిషాల్లో చార్జ్​ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేయడంతో బీవైడీపై ఇన్వెస్టర్లు బుల్లిష్​గా ఉన్నారు. మనదేశంలోని ఐదు అతిపెద్ద ఆటో కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 151.52 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.13.10 లక్షల కోట్లు) ఉంది.  

మారుతి సుజుకి మార్కెట్ విలువ 42.36 బిలియన్ డాలర్లు కాగా, మహీంద్రా అండ్​ మహీంద్రా  విలువ 39.12 బిలియన్ డాలర్లు . టాటా మోటార్స్ 29.02 బిలియన్ డాలర్ల మార్కెట్​క్యాప్​తో మూడోస్థానంలో ఉంది. బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్​కు వరుసగా 24.87 బిలియన్ డాలర్లు, 16.15 బిలియన్ డాలర్ల మార్కెట్​క్యాప్​ ఉంది.