చైనా కార్ల కంపెనీ BYD స్టాక్స్ 40 శాతం పెరిగాయ్..కారణం కొత్త ఛార్జింగ్ సిస్టమేనా?

చైనా కార్ల కంపెనీ BYD స్టాక్స్ 40 శాతం పెరిగాయ్..కారణం కొత్త ఛార్జింగ్ సిస్టమేనా?

 ప్రముఖ చైనాకు కార్ల తయారీ సంస్థ BYD స్టాక్స్ భారీగా పెరిగాయి. 2025లో 40 శాతం పెరిగిన BYD  మార్కెట్ క్యాపిటలైజేషన్ 162 బిలియన్ డాలర్లకు చేరింది. BYD స్టాక్ పెరుగుదల దాని మార్కెట్ క్యాపిటలైజేషన్‌  ఇండియా టాప్ 5 కార్ల తయారీ కంపెనీల మార్కెట్ క్యాప్ విలువను మించిపోయింది. 

అంతేకాదు ఫోర్డ్ మోటార్స్, జనరల్ మోటార్స్, వోక్స్‌వ్యాగన్ ల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కూడా అధిగమించింది. మంగళవారం (మార్చి18) ప్రకటించిన  కొత్త EV సూపర్‌చార్జింగ్ సిస్టమ్ ఆవిష్కరించిన తర్వాత BYD స్టాక్ మరింత ఊపందుకున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. BYD మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో పెరుగుదల దాని ప్రత్యర్థి టెస్లాతో ఉన్న అంతరాన్ని కూడా తగ్గించింది. BYD మార్కెట్ క్యాపిటలైజేషన్ టెస్లా $765.6 బిలియన్ల క్యాపిటలైజేషన్ లో ఐదవ వంతుగా ఉంది. అంతేకాదు ఫిబ్రవరిలో చైనాకు టెస్లా ఎగుమతులు 49శాతం తగ్గాయి. ఇది జూలై 2022 తర్వాత అత్యల్పం. 

పెట్రోల్, డీజిల్ కొట్టించినంత వేగంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ EV టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నట్లు చైనా ప్రముఖ కార్ల కంపెనీ BYD ప్రకటించింది. షెన్‌జెన్‌కు చెందిన BYD కో కార్ల కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల కోసం కొత్త బ్యాటరీ-ఛార్జింగ్ వ్యవస్థను ఆవిష్కరించింది. ఈ వ్యవస్థ సాధారణ పెట్రోల్ బంకులో ఇంధనం నింపేంత వేగంగా దాని కార్లను ఛార్జ్ చేస్తుందని చైనా ఆటోమేకర్ చెబుతోంది.

ALSO READ | మార్చి 23 అర్ధరాత్రి నుంచి 25 అర్ధరాత్రి వరకు.. బ్యాంకు యూనియన్ల సమ్మె.. బ్యాంకులు మూసేస్తారా..?

BYD కొత్త బ్యాటరీ, ఛార్జింగ్ సిస్టమ్ ను పరిచయం చేసింది. సూపర్ ఇ -ప్లాట్‌ఫామ్ గా పిలువబడే ఈ వ్యవస్థ 5 నిమిషాల్లో 470 కి.మీ పరిధిని అందించగలదని ఛార్జింగ్ అందిస్తుందని కంపెనీ ఛైర్మన్,ఫౌండర్ వాంగ్ చువాన్‌ ఫు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి  కొత్త టెక్నాలజీతో వాహనాల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 

BYD  సూపర్ ఈ సిస్టమ్

BYD తన కొత్త EV సిస్టమ్ గురించి ఫౌండర్ వాంగ్ చెబుతూ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్‌ను పొందిన మొదటి మోడల్స్ హాన్ L , టాంగ్ L స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ అని అన్నారు. కొత్త టెక్నాలజీ ఈ కార్లు 2 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటాయని వాంగ్ చెప్పారు.