చండీగఢ్: టీమిండియా సీనియర్ బ్యాట్స్ మన్ శిఖర్ ధవన్ పై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లులు కురిపించాడు. 36 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీ పడుతూ ధవన్ ఆడుతున్న తీరుకు తాను ఫిదా అయ్యానని భజ్జీ అన్నాడు. ఫిట్ నెస్ విషయంలో టీమ్ లో ఉన్న కుర్రాళ్లకు ధవన్ ఏమాత్రం తీసిపోడని చెప్పాడు. గేమ్ లో ధవన్ కమ్ బ్యాక్ ఇవ్వడం హ్యాపీగా ఉందన్నాడు.
‘ధవన్ తిరిగి జట్టులో చేరడం సంతోషంగా ఉంది. అతడు నిబద్ధత కలిగిన ఆటగాడు. ధవన్ కంటే బాగా ఆడుతున్న యంగ్ ప్లేయర్ ఎవరనేది నా ప్రశ్న. ధవన్ కమ్ బ్యాక్ ఇచ్చిన తీరు బాగుంది. పలు అర్ధ సెంచరీలతో తనలో ఇంకా ఆడే సత్తా ఉందని అతడు నిరూపించాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ను భారత్ ఓడిపోయినప్పటికీ.. ధవన్ మాత్రం తనకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాడు’ అని భజ్జీ చెప్పుకొచ్చాడు.
‘క్రికెట్ లో కొందరు ప్లేయర్ల ఏజ్ గురించి కామెంట్లు చేస్తుంటారు. కానీ ఇంకొందరి విషయంలో మాత్రం అలాంటి చర్చల ఊసే ఉండదు. 38, 39, 40 ఏళ్ల వయసులోనూ వరల్డ్ కప్ ఆడినవారు ఉన్నారు. ధవన్ ప్రస్తుతం 36వ పడిలోనే ఉన్నాడు. అతడు చాలా ఫిట్ గా ఉన్నాడు. అంతేగాక కమ్ బ్యాక్ లో రాణిస్తున్నాడు. ధవన్ లో ఇంకొన్నేళ్లు ఆడే సత్తా ఉందనే విషయాన్ని గ్రహించాలి’ అని హర్భజన్ పేర్కొన్నాడు.
మరిన్ని వార్తల కోసం: