మార్పు కోసం నల్గొండ టూ జార్ఖండ్.. MPగా పోటీ చేయడానికి 1600కి.మీ ప్రమాణం

అతని వయసు 87ఏళ్లు, చూపు మందగించినాలే.. నడక తడబడుతున్నాలే.. అయినా ఆయన ఆశయం కోసం 1600 కిలో మీటర్లు ప్రయాణించాడు. 2019 లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి ఇండిపెండింట్ గా పోటీ చేస్తే 16 వేల 456 ఓట్లు సాధించాడు. ఓ సామన్యుడికి అన్ని ఓట్లు వచ్చాయంటే గ్రేటే. ఆయనే రిటైర్డ్ వెటర్నటీ డాక్టర్ కంచర్ల రంగయ్య.  

రంగయ్య వ్యక్తిగత నేపథ్యం 

నల్గొండ జిల్లా ఇల్లూరు అనే మారుమూల గ్రామానికి చెందిన ఈయన ముంబైలో మాస్టర్స్ ఇన్ వెటర్నెటీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి. గవర్నమెంట్ వెటర్నటీ డాక్టర్ గా పనిచేసి ఉద్యోగ విరమణ పొంది తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలనుకున్నాడు. ఎన్నికల్లో డబ్బులకు, మద్యానికి ఓటేసే పద్ధతి మార్చాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మారాలని పట్టుబడ్డాడు.

ఖార్ఖండ్ లో నామినేషన్ ఎందుకంటే?

రంగయ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి జార్ఖండ్ లోని గొడ్డ నియోజకవర్గంలో నామినేషన్ వేశారు. అక్కడ ఎడవ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ  నుంచి ఇండిపెండింట్‌ MPగా పోటీ చేస్తే 16వేల ఓట్లు వచ్చాయి. ఈసారి నల్గొండలో టెక్నికల్ కారణాల వల్ల రంగయ్య నామినేషన్ తిరస్కరించారు. దీంతో ఆయన ఆదివాసీలు, గిరిజనుల జనాభా ఎక్కువగా ఉండి, అభివృద్ధికి అమడ దూరన ఉన్న గొడ్డ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. 

ఇక్కడ 18లక్షల మంది ఓటర్లు ఉండగా.. 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన భార్య విజయ లక్ష్మీ(75)తో కలిసి ప్రచారం చేస్తున్నారు. అక్కడ కనీస వసతులు కూడా ప్రజలకు లేవని రంగయ్య అంటున్నారు. తాను రామకృష్ణ పరమహంసా, స్వామి వివేకానంద స్ఫూర్తిలో ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నా అని అన్నారు. ఆయన నామినేషన్ తిరస్కరణ గురించి మాట్లాడుతూ..  డబ్బున్న వాళ్ల నామినేషన్లే చెల్లుతాయని రంగయ్యా అన్నారు.