జగిత్యాల జిల్లా : జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ లో అర్ధరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. రోడ్డుపై మద్యం మత్తులో హల్ చల్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులతోనూ గొడవకు దిగారు.
పోలీసులను దుర్భాషలాడుతూ వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని.. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.