
కిలోల కొద్దీ బంగారాన్ని ఓ వ్యక్తి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అమరవరం గ్రామానికి చెందిన సింగతల వీరారెడ్డి మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇంట్లో గుంత తవ్వాడు. మేకపోతుని బలిచ్చాడు. అనంతరం సుమారు 15 నుంచి 20 కిలోల బంగారు నాణెపు ముద్దలను గుంతలో పాతిపెట్టబోయాడు. సమాచారం అందడంతో కోదాడ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి, హుజూర్ నగర్ సీఐ భాస్కర్ అక్కడకు చేరుకున్నా రు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నా రు.ఇంటి యజమాని వీరారెడ్డి భార్య నాగమణిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీనిపై విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని డీఎస్పీ తెలిపారు.