వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం : దసరా పండుగకు వాడవాడలా ప్రజలు అమ్మవార్లను ప్రతిష్ఠించి భక్తి, శ్రద్ధలతో పూజలు చేస్తారు. అందుకు ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ వద్ద కాళికామాత విగ్రహాలను వివిధ రూపాల్లో కళాకారులు తయారు చేస్తుండగా ఆదివారం ‘వెలుగు’ క్లిక్ మనిపించింది. ఇప్పటికే చాలా మంది అమ్మవారి విగ్రహాలను కొనుగోలు చేసి తమ కాలనీలకు తరలిస్తున్నారు.