హరిద్వార్: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ ప్లేసెస్ లో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా మారింది. అలాంటప్పుడు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే కుంభమేళాలో ఇంకా ఎన్ని జాగ్రత్తలు తీయకోవాలి? కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇందులో ఫెయిల్ అయ్యిందని విమర్శలు వస్తున్నాయి. థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు, భక్తులు మాస్కులు కట్టుకునేలా చేయడంలోనూ విఫలమైందని కామెంట్స్ వస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి ఇక్కడ 28 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని సమాచారం. అయితే ఇప్పటివరకు వీరిలో 18,169 మందికి టెస్టులు నిర్వహించారని.. వీరిలో 102 మందికి పాజిటివ్ గా తేలిందని తెలిసింది. మేళాకు వచ్చే వారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టును తీసుకురావాలని నిబంధనలు ఉన్నా.. టెస్టు రిపోర్టు లేని వారినీ అనుమతిస్తున్నారు అని జాతీయ మీడియా వర్గాల కథనం ప్రకారం తెలిసింది.