మహా కుంభమేళా తొక్కసలాట ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రయాగ్ రాజ్ లోని సెక్టర్ 2 సంగం వద్ద పుణ్యస్నానాలు చేస్తుండగా తొక్కిసలాట జరిగింది. బుధవారం తెల్లవారు జామున బారీకేడ్డు విరిగిపడటంతో భక్తులు ఒకరిమీద ఒకరు పడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 50 మందికి పైగా భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది.
భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం పుణ్య స్నానాలకు 10కోట్ల మంది తరలివచ్చినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. మౌని అమావాస్య సందర్భంగా ఈరోజు ఉదయం దాదాపు 2కోట్ల 8లక్షల మంది యాత్రికులు స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు.
ALSO READ | మహా కుంభమేళాలో తొక్కిసలాట....అమృత స్నానాలు నిలిపివేత
జనవరి 13 న పండుగ ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 20కోట్లమంది ప్రజలు నదిలో స్నానాలు చేశారని తెలిపారు.ప్రయాగ్రాజ్లోని కుంభమేళా ఉత్సవంలో బుధవారం ఉదయం జరిగిన తొక్కిస లాటలో కనీసం 12మంది మరణించారని ఉంటారని ప్రత్యక్ష సాక్షులు , ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే మృతుల సంఖ్యపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం లేదు.