యెమెన్ సముద్రంలో మునిగిన వలస బోటు..13మంది మృతి, 14 మంది గల్లంతు

యెమెన్ సముద్రంలో మునిగిన వలస బోటు..13మంది మృతి, 14 మంది గల్లంతు

యెమెన్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. తైజ్ గవర్నరేట్ తీరంలో పడవ మునిగి 13 మంది చనిపోయారు. మరో 14 మంది గల్లంతైనట్లు ఐక్యరాజ్యసమితి వలస ఏజెన్సీ( IOM ) ఆదివారం (ఆగస్టు 25, 2024) నాడు తెలిపింది. 25 మంది ఇథియోపియన్లు, రెండు యెమెన్ దేశాలకు పడవలో వస్తుండగా.. యెమెన్ లోని బని అల్ హకం సబ్ జిల్లాలోని దుబాబ్ జిల్లా సమీపంలో మునిగిపోయిందని వెల్లడించింది. మృతుల్లో 11మంది పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

పడవ కెప్టెన్, అతని సహాయకుడితో సహా గల్లంతయిన వారికోసం సహాయక చర్యలు చేపట్టినట్లు ఐక్యరాజ్యసమితి వలసఏజెన్సీ తెలిపింది. ఓడ బోల్తా పడటానికి కార ణాలు ఇంకా తెలియరాలేదని IOM తెలిపింది. 

యెమెన్ లో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. ఈ ప్రమాదం మొదటిది కాదు.. జూన్ , జూలైలో కూడా ఓడలు మునిగిపోవడం జరిగింది.. నెల రోజుల తర్వాత మంగళవారం నాటి ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు.  

ALSO READ | పాకిస్థాన్ దుర్ఘటన: లోయలో పడ్డ బస్సులు..35 మంది మృతి

ప్రతి సంవత్సరం పదివేల మంది శరణార్థులు, వలసదారులు ఆఫ్రికా నుండి యెమెన్ కు వస్తుంటారు. సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా పేద ఆర్థిక అవకాశా ల నుంచి  తప్పించుకోవడానికి, చమురు అధికంగా ఉండే గల్ఫ్‌కు చేరుకోవడానికి ఎర్ర సముద్రం మీదుగా ప్రయాణిస్తుంటారు. 2023లో  యెమెన్‌లో 97,200 కంటే ఎక్కువ మంది రాకపోకలను కొనసాగించినట్లు IOM తెలిపింది. ఈక్రమంలో  తరుచుగా పడవ ప్రమాదాలు చోటు చేసుకుంటాయని IOM వెల్లడించింది.