బ్యాంకాక్ : సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని సుపాన్ బురి ప్రావిన్స్‌లోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది వరకు మృతి చెందారని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పేలుడుకు కారణమేంటన్న వివరాలు తెలియరాలేదు.
ఫిబ్రవరిలో జరుపుకునే చైనీస్ న్యూ ఇయర్ వేడుకల కోసం ఇక్కడి ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున బాణ సంచా తయారు చేస్తున్నారు. గతేడాది జులైలోను దక్షిణ థాయ్ లాండ్‌లోని ఓ బాణసంచా గోదాములో బారీ పేలుడు సంభవించింది. నారాతివాట్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో 10 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.