బస్సు, ఆయిల్​ ట్యాంకర్​ ఢీ.. 21 మంది మృతి

  • అఫ్గానిస్తాన్​లో ఘోర ప్రమాదం

కాబూల్: దక్షిణ అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌లోని హెల్మండ్ ప్రావిన్స్‌‌‌‌‌‌‌‌లో ట్యాంకర్, బస్సు ఢీకొని 21 మంది మృతి చెందారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఇంకో 38 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాబూల్​ వెళ్తున్న బస్సు.. కాందహార్ హైవే మీద ఓ బైక్​ను ఢీకొంది.

ఆపై కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న ట్యాంకర్​ను ఢీ కొట్టింది. దీంతో మంటలు చెలరేగి బైక్ మీదున్న ఇద్దరు, ట్యాంకర్​లో ఉన్న ముగ్గురితోపాటు, బస్సులోని 16 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయాలపాలైన మరో 11 మంది పరిస్థితి సీరియస్​గా ఉందని అధికారులు చెప్పారు.