రష్యా ఆధీనంలోని బేకరీపై దాడి.. 28 మంది మృతి

మాస్కో: రష్యా ఆధీనంలోని లిసిచాన్స్క్ సిటీలోని బేకరీపై ఉక్రెయిన్ దాడి చేసిందని రష్యన్ అధికారులు ఆరోపించారు. శనివారం జరిగిన ఈ దాడిలో దాదాపుగా 28 మంది మృతి చెందారని తెలిపారు. మరణించిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు రష్యన్ అధికారులు చెప్పారు. శిథిలాల కింద చిక్కకుపోయిన వారిలో 10 మందిని రక్షించినట్టు పేర్కొన్నారు. 

ఈ దాడిని కీవ్ బలగాలే చేశాయని ఆరోపించారు. కానీ, ఉక్రెయిన్ మాత్రం ఈ ఘటనపై స్పందించలేదు. ఉక్రెయిన్ పై గత 24 గంటలుగా రష్యన్ దళాలు తీవ్రమైన దాడి చేస్తున్నాయని కీవ్ అధికారులు ఆదివారం వెల్లడించారు. సుమీ ప్రాంతంలో 16 వేర్వేరు చోట్ల దాడులు చేశాయని స్పష్టం చేశారు.