భువనేశ్వర్: ఒడిశాలోని జాజ్పూర్ సమీపంలోని బారామతి ప్రాంతంలో ఫ్లై ఓవర్ నుంచి బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రయాణికులతో పూరి నుంచి కోల్ కతా వెళ్తున్న బస్సు .. డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో ఫ్లై ఓవర్ పైనుంచి పడిపోయింది.
విషయం తెలుసుకున్న అధికారులు స్పాట్ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సుల్లో 40 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.