కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం .. 41 మంది సజీవదహనం

కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం .. 41 మంది సజీవదహనం

కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 2024 జూన్ 12వ తేదీ  బుధవారం జరిగిన ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో 41 మంది సజీవదహనం అయ్యారు. ఇందులో  పలువురు భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. మరో 15 మంది గాయపడ్డారు.  కువైట్‌లోని దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లోని మంగాఫ్ నగరంలో తెల్లవారుజామున 4 గంటలకు భవనంలో మంటలు చెలరేగాయి.  

ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్‌లో 160 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు.   ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.  అగ్నిప్రమాదం సభవించిన భవనంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉంటున్నారు. 

ఘటన అనంతరం చాలా మందిని రక్షించాం. కానీ దురదృష్టవశాత్తూ మంటల ధాటికి పొగ పీల్చడం వల్ల చాలా మంది మరణించారు’ అని సీనియర్‌ పోలీస్‌ కమాండర్‌ ఒకరు తెలిపారు.  కాగా  కువైట్ దాదాపు 4.2 మిలియన్ల జనాభా కలిగిన దేశం, ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉంది. 

కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై  కేంద్రమంత్రి జైశంకర్ తెలిపారు.  ప్రమాద స్థలానికి తమ రాయబారి వెళ్లినట్లుగా చెప్పారు.    ప్రాణాలు కోల్పోయిన  వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.