తూర్పు ఇరాన్‌లోని ఒక గనిలో జరిగిన పేలుడులో 51 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. ఇంకా చాలా మంది కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తోంది.
ఆదివారం (సెప్టెంబర్ 22) ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 540కిమీ (335 మైళ్లు) దూరంలోని తబాస్‌లోని మదంజూ కంపెనీ నిర్వహిస్తున్న బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీక్ కారణంగా పేలుడు సంభవించిందని IRNA వార్తా సంస్థ తెలిపింది.
శనివారం రాత్రి 9:00 గంటలకు అకస్మాత్తుగా గ్యాస్ లీక్ సంభవించినప్పుడు గనిలోని B, C అనే రెండు బ్లాక్‌లలో కనీసం 69 మంది పని చేస్తున్నారు.B బ్లాక్‌లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. బ్లాక్‌లో ఉన్న 47 మంది కార్మికులలో 30 మంది మరణించారు.17 మంది గాయపడ్డారని సౌత్ ఖొరాసన్ ప్రావిన్స్ గవర్నర్ అలీ అక్బర్ రహీమి తెలిపారు.
ALSO READ | ఇజ్రాయెల్ దాడిలో బీరుట్లో 31 మంది మృతి
బ్లాక్ Cలో రెస్క్యూ ఆపరేషన్‌లు ప్రారంభమయ్యాయని..బ్లాక్‌లో మీథేన్ సాంద్రత ఎక్కువగా ఉందని, ఆపరేషన్ మూడు-నాలుగు గంటల సమయం పడుతుందని ఆయన చెప్పారు. దేశం బొగ్గులో 76 శాతం ఈ ప్రాంతం నుండి అందించబడుతుంది..సుమారు 8 నుంచి10 పెద్ద కంపెనీలు ఈ ప్రాంతంలో పనిచేస్తున్నాయి అని రహీమి చెప్పారు.