
ఇరాన్: బందర్ అబ్బాస్లోని ఇరాన్ పోర్ట్ సిటీలో భారీ పేలుడు సంభవించింది. ఉవ్వెత్తున మంటలు, పొగలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. రజేయి పోర్టులో జరిగిన ఈ అగ్ని ప్రమాద ఘటనలో 516 మందికి పైగా గాయపడ్డారు. ఆయిల్ ట్యాంక్స్, పెట్రో కెమికల్ కంటైనర్లతో ఉండే రజేయి పోర్టులో బ్లాస్ట్ జరగడంతో ఇరాన్ ఉలిక్కిపడింది. పలు కంటైనర్లు ఈ బ్లాస్ట్లో పేలిపోయాయి.
My beloved #Iran 💔🇮🇷 pic.twitter.com/LopaJDyOJS
— MIZGOL (@LeylaRostami) April 26, 2025
ఈ పేలుడుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. షాహిద్ రజేయి పోర్టు ఏరియా తెహ్రాన్కు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. నాలుగు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఈ పేలుడు జరిగిన కొన్ని నిమిషాలకే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్యను ఇప్పటికైతే అధికారికంగా ప్రకటించలేదు.
oderosísima explosión en el puerto de Shahid Rajaee, Bandar Abbas.
— Lev Nikoláyevich (@LevNikolay) April 26, 2025
Muchos edificios del puerto han quedado destruidos y hay más de 500 heridos.
A pocos km (#oman) se están reanudando las conversaciones indirectas entre #eeuu e #iran pic.twitter.com/DNBaRSqD8C
కంటైనర్లు పేలిపోవడంతో ప్రాణ నష్టం కూడా జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడు కారణంగా బందర్ అబ్బాస్ పోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు. కంటైనర్లు పేలిపోవడానికి కారణాలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. ఈ పేలుడు వెనుక కుట్ర కోణం ఉందేమోనన్న కోణంలో కూడా ఇరాన్ దర్యా్ప్తు మొదలుపెట్టింది. పేలుడు ధాటికి పోర్టు సమీపంలోని పలు భవనాలు భూకంపం సమయంలో మాదిరిగా కుదుపులకు లోనవడం గమనార్హం. ఒకట్రెండు భవనాలు కూలిపోయినట్లు సమాచారం.
►ALSO READ | రెండు దేశాలు మాకు దగ్గరే.. పహల్గాం ఉగ్రదాడిపై మరోసారి స్పందించిన ట్రంప్