స్టేడియంలో తొక్కిసలాట.. తొమ్మిది మంది మృతి

స్టేడియంలో తొక్కిసలాట.. తొమ్మిది మంది మృతి

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. మే 20వ తేదీన ఎల్ సాల్వడార్ స్టేడియంలో సాకర్ మ్యాచ్ జరుగుతుండగా అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ  ఘటనలో 9 మంది చనిపోగా మరి కొంతమందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.   మృతుల్లో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని.. బాధితులందరూ 18 ఏళ్లు పైబడిన వాళ్లేనని పోలీసులు తెలిపారు.

మాన్యుమెంటల్ స్టేడియంలో  లోకల్  జట్టు అలియాంజా,  శాంటా అనా  జట్టు(FAAS) మధ్య జరిగిన మ్యాచ్‌ కు పరిమితికి మించి  అభిమానులు  తరలివచ్చారు.  మ్యాచ్ ప్రారంభమైన 16 నిముషాలకే అభిమానులు స్టేడియంలోకి ఒక్కసారిగా దూసుకురావడంతో  మ్యాచ్‌ను నిలిపివేశారు. గేట్లు మూసివేసిన తర్వాత కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు  స్టేడియంలోకి  దూసుకురావడంతోనే  ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.  కొంతమంది అభిమానులు నకిలీ టిక్కెట్లను కొనుగోలు చేసి వచ్చినట్లు  అధికారులు భావిస్తున్నారు . దీనిపైన  విచారణ జరుగుతోందని చెప్పారు.