పాల్వంచ రిలయన్స్ స్మార్ట్ వద్ద హమాలీల ఆందోళన

పాల్వంచ, వెలుగు : పట్టణంలోని ప్రముఖ రిలయన్స్ షాపింగ్ మాల్ లో సామాను ఎగు మతి, దిగుమతి తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హమాలీలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి దొడ్డ రవికుమార్ నేతృత్వంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్ టీ యూ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు.

స్మార్ట్ లో సామగ్రి ఎగుమతి, దిగుమతి మాల్ సిబ్బంది చేసు కోవటం మూలంగా తమకు అన్యాయం జరుగుతోందని కార్మికులు ఆరోపించారు. దీంతో మాల్ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలను సమన్వయం చేసేందుకు ప్రయత్నించారు. అయినా వినకపోవడంతో సీఐ వినయ్ కుమార్ వద్ద చర్చలు జరిపేందుకు ఇరువర్గాలు సిద్ధమయ్యాయి.