30 ఏళ్లకే గుడిలోనే ప్రాణాలొదిలాడు.. ప్రదక్షిణలు చేస్తుండగా కుప్పకూలాడు

హైదరాబాద్ KBHPలో విషాదం.. టెంపుల్ బస్ స్టాప్ సమీపంలోని ఆంజనేయస్వామి గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. KBHPలో నివాసం ఉండే విష్ణువర్ధన్(31) సోమవారం (నవంబర్ 11) ఉదయం టెంపుల్ బస్ స్టాప్ సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లాడు. దర్శనం చేసుకునేందుకు ఆలయ ప్రదక్షిణలు చేస్తుండగా.. విష్ణువర్ధన్ కు హాట్ ఎటాక్ వచ్చింది. 

ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే అక్కడున్న భక్తులు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. 30ఏళ్లకే గుండెపోటుతో విష్ణువర్ధన్ గుడిలోనే మృతి చెందాడు. KPHB పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విష్ణువర్ధన్ గుడి చుట్టూ తిరుగుతూ.. పడిపోయిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.