‘దేర్ ఈజ్ ఆల్‌వేస్ హోప్’.. 50 ఏండ్ల తన రాజకీయ జీవితంలో జో బైడెన్ తరచుగా చెప్పే మాట ఇది. అదే నమ్మకం ఆయనను ప్రెసిడెంట్‌ను చేసింది. మిడిల్ క్లాస్ జోను కాస్తా మిస్టర్ ప్రెసిడెంట్‌గా మార్చింది. వ్యక్తిగత జీవితంలో ఎన్ని విషాదాలు ఎదురైనా తన కలను నిజం చేసుకునేలా ముందుకు తీసుకెళ్లింది. నత్తోడా అన్న వారి నోటి నుంచే డియర్ ప్రెసిడెంట్ అని పిలిపించుకునేలా చేసింది. తన వైఫల్యాలనే గెలుపు మెట్లుగా మార్చుకుని ప్రెసిడెంట్ అయ్యారు. మొత్తంగా 78 ఏండ్ల వయసులో అధ్యక్ష పదవిని చేపడుతున్న తొలి వ్యక్తిగా బైడెన్ రికార్డు సృష్టించారు.
అమెరికా పెన్సిల్వేనియాలోని స్ర్కాన్‌టన్‌లో 1942 నవంబర్ 20న బైడెన్ పుట్టారు. చిన్నప్పుడే ఆయన ఫ్యామిలీ డెలవెర్‌లో సెటిల్ అయ్యింది. నిజానికి వారిది డబ్బున్న ఫ్యామిలీనే అయినా బైడెన్ పుట్టే సమయానికి ఆయన తండ్రి ఆర్థికంగా నష్టాల్లో ఉన్నారు. దీంతో ఆయన చిన్నతనం పేదరికంలోనే గడిచింది. తర్వాత కొద్దిగా కోలుకుని మిడిల్‌క్లాస్ రేంజ్‌కు చేరుకుంది. 1966లో సిరాక్యూస్ యూనివర్సిటీలో చదువుతున్న నీలియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1968లో సిరాక్యూస్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ తీసుకున్నారు. విల్మింగ్టన్ లో లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. బైడెన్‌కు చిన్నతనంలో నత్తి ఉండేది. తోటి పిల్లలంతా అతడిని నత్తోడా అని ఏడిపించే వారు. వారి హేళనలే బైడెన్లో పట్టుదలను పెంచాయి. దాని నుంచి బయటపడేందుకు అద్దం ముందు నుంచొని కవితలు, ప్రసంగాలు ప్రాక్టీస్ చేసేవారు. ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యింది. నెమ్మదిగా తన నత్తి తగ్గింది. ఇప్పటికీ అప్పుడప్పుడు మాట తడబడుతుంటుంది.
మూడో ప్రయత్నంలో..
ప్రెసిడెంట్ కావాలన్నది బైడెన్ కల. 1988లో తొలిసారి ప్రెసిడెన్షియల్ రేస్‌లోకి దిగే ప్రయత్నం చేశారు. డెమొక్రాటిక్ అభ్యర్థిత్వం కోసం చివరి వరకూ పోరాడారు. ఆ ఎన్నికల సమయంలో మొదట్లో అందరికంటే ముందున్న బైడెన్.. అటు తర్వాత నెమ్మదిగా పట్టు కోల్పోయారు. సొంత గ్రూప్‌లో విభేదాల వల్ల పోటీ నుంచి తప్పుకోవలసి వచ్చింది. 2008లో కూడా ప్రెసిడెన్షియల్ అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఒబామా చరిష్మా ముందు నిలవలేక పోటీ నుంచి తప్పుకున్నారు. బైడెన్ సత్తాను గుర్తించిన ఒబామా ఆయనకు వైస్ ప్రెసిడెంట్‌గా చాన్స్ ఇచ్చారు. దీంతో 2008, 2012లో ఆయన వైస్ ప్రెసిడెంట్ అయ్యారు.
29 ఏండ్ల వయసులో సెనేట్‌కు..
1972లో బైడెన్ 29 ఏండ్ల వయసులో తొలిసారిగా సెనేట్‌కు ఎన్నికయ్యాడు. అలా ఎన్నికైన రెండో పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ప్రమాణ స్వీకారం చేయడం కోసం వాషింగ్టన్‌లో ఉండిపోయాడు. ఇదే సమయంలో సొంతూరు డెలవెర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడి భార్య నీలియా, కూతురు నోమీ మరణించారని ఫోన్ వచ్చింది. ఇద్దరు కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కొడుకుల బెడ్ పక్కనుంచే బైడెన్ ప్రమాణస్వీకారం చేశాడు. భార్య మరణం తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. కానీ కొడుకుల గురించి ఆలోచించి ఆ నిర్ణయాన్ని మానుకున్నాడు. పిల్లల కోసం డెలవెర్ నుంచి రోజూ వాషింగ్టన్‌కు రైల్లో వెళ్లివచ్చేవాడు. 1979లో ఓ స్కూల్ టీచర్‌గా చేస్తోన్న జిల్‌ను రెండో పెండ్లి చేసుకున్నాడు. వాళ్లకి ఓ కూతురు.. ఆస్లా. బైడెన్ రెండోసారి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న టైంలోనే పెద్ద కొడుకు బ్యూ బ్రెయిన్ కేన్సర్‌తో మరణించాడు. పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉండే బ్యూను తన వారసుడిగా బైడెన్ భావించేవాడు. కొడుకు మరణాన్ని ఊహించలేకపోయాడు.
ఓల్డ్ ఏజ్‌లో గోల్డెన్ చాన్స్
అతి పెద్ద వయసులో ప్రెసిడెంట్ గా బైడెన్ రికార్డు సృష్టించనున్నారు. ఇప్పుడు బైడెన్ వయసు 78 ఏండ్లు. ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టేటప్పటికి ఆయన వయసు 70 ఏండ్లు. ట్రంప్‌కంటే ముందు రోనాల్డ్ రీగన్(69 ఏండ్లు)అతి ఎక్కువ వయసులో ప్రెసిడెంట్ అయిన వ్యక్తిగా ఉన్నారు. యంగ్ ప్రెసిడెంట్ల విషయానికి వస్తే 1901లో థియోడర్ రూజ్వెల్ట్ 42 ఏండ్ల వయసులోనే ప్రెసిడెంట్ అయ్యారు. జాన్ ఎఫ్ కెనడీ 43 ఏండ్ల వయసులో అధ్యక్షుడయ్యారు. యులిసెస్ గ్రాంట్ 46 ఏండ్లకు, బిల్ క్లింటన్ 46 ఏండ్లకు, ఒబామా 47 ఏండ్ల వయసులో ప్రెసిడెంట్ పదవి చేపట్టారు. ఆరోగ్యం విషయంలో బైడెన్ చాలా జాగ్రత్తగా ఉంటారు. మందు, సిగరెట్లలాంటి అలవాట్లు లేవు. వారానికి ఐదు రోజులు ఎక్సర్సైజ్ చేస్తారు. 1988లో బైడెన్‌కు తీవ్ర అనారోగ్యం చేసింది. బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో బైడెన్ చనిపోతాడని భావించి చర్చి పాస్టర్‌ను కూడా పిలిపించారు.
తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్
కమలా హ్యారిస్.. అమెరికా తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్. అంతే కాదు భారత సంతతికి చెందిన వ్యక్తి. ఆమె తల్లి ఇండియన్. తండ్రి జమైకన్. వైస్ ప్రెసిడెంట్ అయిన నల్ల జాతికి చెందిన మహిళ కూడా కమలానే. రైట్స్ యాక్టివిస్ట్‌గా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన కమల.. మొదట కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్నారు. అసలు నేరుగా డెమొక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్‌గా పోటీ పడిన ఆమె.. జో బైడెన్‌కు పార్టీలో మద్దతు రావడంతో రేసు నుంచి తప్పుకున్నారు. అయితే ఆమెకు ప్రజల్లో, పార్టీలో ఉన్న ఫాలోయింగ్ తో బైడెన్ ఆమెను వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా ఎంపిక చేశారు. అమెరికాలో ఇప్పటివరకు
రాజకీయ పార్టీల నుంచి వైస్ ప్రెసిడెంట్ పోటీ పడింది ముగ్గురే. 1984లో డెమొక్రటిక్ క్యాండిడేట్‌గా గెరాల్డైన్ ఫెరారో, 2008లో రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్‌గా
సారా పాలిన్ పోటీ చేశారు. కానీ గెలవలేదు. తొలిసారి కమలా హారిస్ మాత్రమే గెలిచారు.
ఇండియాకు లాభమా? నష్టమా?
బైడెన్ వల్ల ఇండియాకు లాభమా, నష్టమా? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. అమెరికా ఫ్రెండ్షిప్ చేస్తోందంటే అందులో ఎక్కువగా ఆర్థిక ప్రయోజానాలే కీలకంగా ఉంటాయి. ఎప్పుడూ పాక్‌కు సపోర్ట్‌గా నిలిచే అమెరికా వేరే ఆప్షన్ లేని పరిస్థితుల వల్లే ఇండియాకు మద్దతు ఇస్తోంది. చైనా, భారత్ బలపడితే తమ ఆధిపత్యం దెబ్బతింటుందని అమెరికా భయం. అందుకే ట్రంప్ ఎప్పుడూ ఇండియా, చైనాలను ఆడిపోసుకునే వాడు. బైడెన్ తీరు కూడా దాదాపు ఇలాగే ఉండొచ్చు. పైకి స్నేహంగా ఉన్నా అమెరికా ప్రయోజనాలే వారికి ముఖ్యం. గతంలో బైడెన్ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై ఇండియాను తప్పుబట్టారు. ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఇలాగే వ్యవహరిస్తారా అనేది ఇప్పుడే చెప్పలేం. అమెరికా ప్రయోజనాలను బట్టి బైడెన్ నిర్ణయాలు ఉంటాయి. ఇతర దేశాల నుంచి వలసలను తగ్గించడానికి ట్రంప్ చాలా ఆంక్షలు విధించాడు. వీటిని బైడెన్ తప్పుబట్టాడు. తాను అధికారంలోకి వస్తే ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులు చేస్తానని హామీ ఇచ్చాడు. అంటే వీసాల విషయంలో కొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకోవచ్చు. కాగా, పాక్, చైనాలకు అనుకూలంగా బైడెన్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది మనకు కాస్త ఇబ్బందే.
ఈ ఎలక్షన్ అంతా పొలిటికల్ డ్రామా
ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఎంతో హైడ్రామా నడిచింది. అమెరికా రాజకీయంలో గతంలో ఎన్నడూ చూడని సీన్లు ఈసారి కనిపించాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చే వరకూ ఎన్నో అనుమానాలు, విమర్శలు కొనసాగాయి. ఎలక్షన్లలో రిగ్గింగ్ జరిగిందంటూ స్వయంగా ప్రెసిడెంట్ హోదాలో ట్రంప్ ఆరోపణలు చేశారు. పదవి నుంచి తప్పుకునేందుకు కూడా ఆయన ఒక దశలో అంగీకరించలేదు. న్యాయ పోరాటం వరకూ వెళ్లారు. అలాగే రెండుసార్లు ఆయనపై ఇంపీచ్మెంట్ ను ఎదుర్కొన్న ప్రెసిడెంట్‌గా చెడ్డపేరు మూటగట్టుకున్నారు ట్రంప్.
క్యాపిటల్ పై దాడి.. ఒక మాయని మచ్చ
ట్రంప్ పదవి నుంచి దిగడానికి కొద్దిరోజుల ముందు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ బిల్డింగ్ రణరంగంగా మారింది. వేలాది మంది ట్రంప్ సపోర్టర్లు బిల్డింగ్‌పైకి దూసుకొచ్చారు. తాళ్లు, నిచ్చెనలు వేసుకుని గోడలెక్కారు. కిటికీల అద్దాలు, మెయిన్ డోర్లను పగులగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. కత్తులు, తుపాకులతో వీరంగం చేశారు. పోలీసులను పట్టుకుని చితకబాదారు. తర్వాత సెనేట్, హౌస్‌ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో అరాచకం సృష్టించారు. బైడెన్ గెలుపును కన్ఫార్మ్ చేసేందుకు సమావేశమైన చట్టసభ్యులను బెంబేలెత్తించారు. దీంతో సెనేటర్లు బెంచీల కింద దాక్కోవాల్సి వచ్చింది. చివరికి పోలీసుల సాయంతో అండర్‌గ్రౌండ్ టన్నెల్ ద్వారా బయటపడ్డారు. నాలుగు గంటలపాటు అమెరికా పార్లమెంటులో జరిగిన ఈ బీభత్సాన్ని ప్రపంచం మొత్తం నివ్వెరపోయి చూసింది. 200 ఏండ్లలో క్యాపిటల్ బిల్డింగ్‌పై జరిగిన దాడి ఇదే. సేవ్ అమెరికా పేరుతో వాషింగ్టన్‌లో ట్రంప్ నిర్వహించిన సభే ఈ దాడికి కారణం. బైడెన్ కన్ఫర్మేషన్ను వ్యతిరేకిస్తూ క్యాపిటల్ బిల్డింగ్‌కు మార్చ్ చేయాలంటూ పిలుపునిచ్చిన ట్రంప్ హింస చెలరేగడంతో శాంతి వచనాలు పలికారు.
16 మంది డెమొక్రాట్లు.. 19 మంది రిపబ్లికన్లు
అమెరికా మొదటి ఆరుగురు ప్రెసిడెంట్లు డెమొక్రాట్లు కాదు రిపబ్లికన్లు కాదు. ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్. ఆయన అసలు ఏ పార్టీకి చెందరు. రెండో ప్రెసిడెంట్ జాన్ ఆడమ్స్ ఫెడరలిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి. అమెరికాలో తొలి పొలిటికల్ పార్టీ ఇదే. ఆ తర్వాత ఎన్నికైన నలుగురు కూడా డెమొక్రటిక్–రిపబ్లికన్ పార్టీ సభ్యులే. అయితే అది మోడ్రన్ డెమొక్రటిక్ పార్టీగా, ద విగ్ పార్టీగా విడిపోయింది. 1828లో ఫెడరలిస్ట్ పార్టీ నుంచి విడిపోయి డెమొక్రటిక్ పార్టీ ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ డెమొక్రటిక్ పార్టీ తరఫున 16 మంది అమెరికా ప్రెసిడెంట్లుగా ఎన్నికయ్యారు. ఇక 1854లో రిపబ్లికన్ పార్టీ ఏర్పాటైంది. రిపబ్లికన్ పార్టీ తరఫున ఎన్నికైన మొదటి ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్. 1861లో ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. డెమొక్రటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ కంటే ముందే ఏర్పాటైనా రిపబ్లికన్లే ఎక్కువగా ప్రెసిడెంట్లు అయ్యారు. మొత్తంగా 19 మంది రిపబ్లికన్లు అధ్యక్ష పదవిని చేపట్టారు. విగ్ పార్టీ తరఫున నలుగురు ప్రెసిడెంట్ అయ్యారు.
అబ్రహాం లింకన్..
1861 నుంచి 1865 వరకూ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన లింకన్ అమెరికా గ్రేటెస్ట్ ప్రెసిడెంట్లలో ఒకరు. సివిల్‌వార్ టైంలో అమెరికాను ముందుకు నడిపించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయారు. అప్పటి వరకూ బానిసలుగా మగ్గిపోయిన వారికి స్వేచ్ఛను ఇచ్చిన వ్యక్తి. ఇది మొత్తంగా బానిసత్వాన్ని రూపుమాపకపోయినా ప్రజల ఆలోచనా విధానాన్ని మాత్రం మార్చింది. 1865లో లింకన్ హత్యకు గురయ్యారు.
గెరాల్డ్ ఫోర్డ్..
రిపబ్లికన్ పార్టీకి చెందిన ఫోర్డ్ 1974 నుంచి 1977 వరకూ అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అయితే ఈయనకు ఒక స్పెషాలిటీ ఉంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా, వాటిలో గెలవకుండా ఆ పదవులు చేపట్టారు. స్పైరో అగ్నివ్ రాజీనామా చేయడంతో ఫోర్డ్‌ను వైస్ ప్రెసిడెంట్‌గా అప్పటి ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ అపాయింట్ చేశారు. ఇది జరిగిన కొద్ది కాలానికే నిక్సన్ రాజీనామా చేయడంతో ఫోర్డ్ నేరుగా అధ్యక్షుడయ్యారు.
ఫ్రాంక్లిన్ డి. రూజ్ వెల్ట్..
1933 నుంచి 1945 వరకూ అంటే తాను చనిపోయే వరకూ ప్రెసిడెంట్ పదవిలో రూజ్వెల్ట్ కొనసాగారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన రూజ్వెల్ట్ వరుసగా నాలుగు టర్మ్‌లు ప్రెసిడెంట్ అయ్యారు. ప్రపంచాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసిన గ్రేట్ డిప్రెషన్, సెకండ్ వరల్డ్ వార్ వంటి ప్రతికూల పరిస్థితుల్లో దేశాన్ని రూజ్వెల్ట్ ముందుకు నడిపించారు.
మిడిల్ క్లాస్ జో ఇగ మిస్టర్ ప్రెసిడెంట్
- వెలుగు ఓపెన్ పేజ్
- January 20, 2021
లేటెస్ట్
- IPL 2025 Mega Action: వేలంలో మెరిసిన SRH.. హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
- ఈ సారి అంతంత మాత్రమే.. 2025 సీజన్ RCB పూర్తి జట్టు ఇదే
- US Probe Effect: అదానీతో వ్యాపారం రద్దు చేసుకున్న ఫ్రాన్స్ కంపెనీ
- మెగా వేలంలో 20 మందిని కొన్న చెన్నై.. నెక్ట్స్ సీజన్‌కు CSK ఫుల్ స్క్వాడ్ ఇదే
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- నార్మన్ పోస్టర్స్ సంస్థకు దక్కిన అమరావతి భవనాల డిజైన్ల టెండర్
- కారు డ్రైవర్ నిర్లక్ష్యం..ఆడుకుంటున్న చిన్నారి ప్రాణాలు తీసింది
- ఐపీఎల్ మెగా వేలంలో ఏపీ క్రికెటర్ల హవా.. ఆక్షన్‌లో ముగ్గురు సోల్డ్
- ఐపీఎల్ మెగా వేలంలో సంచలనం.. కోటీశ్వరుడైన 13 ఏళ్ల కుర్రాడు
- మాలల సింహా గర్జనకు పెద్దఎత్తున తరలిరావాలి: ఎమ్మెల్యే వివేక్
Most Read News
- Gold rate : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర
- IND vs AUS: సుందర్ సర్ ప్రైజ్ డెలివరీ.. 140 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి
- IPL 2025 Mega Action: ఏడిస్తే 23 కోట్లు ఇచ్చారు.. కెప్టెన్సీ కూడా కావాలంట: కేకేఆర్ ప్లేయర్ డిమాండ్
- IPL Auction 2025 Live Updates: ఐపీఎల్ మెగా వేలం.. డే-2 లైవ్ అప్డేట్స్
- Good Health : మీకు షుగర్ ఉందా.. అయితే ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి.. ఎనర్జీతోపాటు ఆరోగ్యం కూడా..
- బ్యాంకాక్ నుంచి విషపూరిత పాములు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టుకున్న అధికారులు
- పారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా
- Aadhaar Card: ఆధార్ కార్డులో కరెక్షన్ రూల్స్ మరింత కఠినతరం..ఈ విషయం అందరూ తెలుసుకోవాల్సిందే
- తలుపులు మూసేసి రాత్రంతా దందా.. పాతబస్తీలో పోలీసుల ఆకస్మిక దాడులు
- కార్తీకమాసం.. నవంబర్ 26 ఏకాదశి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని ఇలా పూజించండి..