రాజ్యాంగాన్ని రూపొందించే సమయానికి కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే విధాన పరిషత్‌లు ఉన్నాయి. ప్రస్తుతం కూడా ఆరు రాష్ట్రాల్లోనే శాసన మండలిలు ఉన్నా యి. కొంతమంది అన్ని రాష్ట్రాల్లో పరిషత్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా కొందరు ఉన్న వాటిని కూడా రద్దు చేయాలని సూచించారు. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ విషయంలో మధ్యే మార్గాన్ని అనుసరించారు. రాష్ట్రాల్లో విధాన పరిషత్‌ల ఏర్పాటు విషయం రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాల ఇష్టానికి వదిలేశారు. అయితే, విధాన సభతో పోలిస్తే విధాన పరిషత్ చాలా పరమితమైన అధికారాలను కలిగి ఉంటుంది. పార్లమెంట్లో ఎగువసభ అయిన రాజ్యసభతో పోల్చినా శాసన మండలి నామమాత్రమైందే.
మంత్రి మండలి ఏర్పాటు
విధానసభలో సాధించిన మెజార్టీని అనుసరించి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు మాత్రమే సమష్టి బాధ్యత వహిస్తుంది. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించవచ్చు. ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులు విధానసభలో వీగిపోయినా, ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే బిల్లులు నెగ్గినా ప్రభుత్వం రాజీనామా చేయాలి. శాసనసభ కోత తీర్మానాల వంటి అంశాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదుపులో ఉంచగలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తును విధానసభ మాత్రమే నిర్ణయిస్తుంది. ఈ విషయంలో పరిషత్‌కు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.
సాధారణ బిల్లులు
సాధారణ బిల్లులను ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. విధానసభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులపై పరిషత్ మూడు నెలల్లోగా తన నిర్ణయాన్ని తెలపాలి. శాసనసభ నిర్ణయాన్ని శాసనమండలి అంగీకరిస్తే గవర్నర్ ఆమోదానికి పంపుతారు.
విధానసభ పంపిన బిల్లుపై శాసన మండలి మూడు నెల్లోగా తమ నిర్ణయాన్ని తెలుపకపోయినా లేదా తిరస్కరించినా లేదా సవరణలు సూచించినా సభ తిరస్కరించినట్లుగానే భావించాలి. పరిషత్ తిరస్కరించిన బిల్లులు తిరిగి విధానసభకు చేరుతాయి.
విధానసభ సవరణలతో గానీ లేదా యథావిధిగా గానీ రెండోసారి ఆమోదించి పరిషత్‌కు పంపించగా ఆ బిల్లులపై పరిషత్ నెల రోజుల్లోగా నిర్ణయం తెలపాలి. నెల రోజుల్లోగా నిర్ణయాన్ని తెలపకపోయినా లేక తిరస్కరించినా ఆమోదించినట్లుగానే భావించి గవర్నర్ ఆమోదానికి పంపుతారు.
భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు రాష్ట్రల్లో ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. సాధారణ బిల్లులను విధానపరిషత్ నాలుగు నెలల వరకు నిలిపివేయగలుగుతుంది.
ఆర్థిక బిల్లులు
ఒక బిల్లు ఆర్థికమైనదీ కానిదీ విధాన సభ స్పీకర్ నిర్ణయిస్తారు. గవర్నర్ అనుమతితో ఆర్థిక బిల్లు మొదట విధాన సభలోనే ప్రవేశపెట్టాలి. విధాన సభ ఆమోదించి పంపిన ఆర్థిక బిల్లులపై శాసన మండలి 14 రోజుల్లోగా తన నిర్ణయం తెలపాలి.
ఆర్థిక బిల్లులను పరిషత్ తిరస్కరించినా లేక సవరణలు సూచించినా విధాన సభ రెండోసారి ఆమోదిస్తే పరిషత్‌కు పంపకుండానే గవర్నర్ ఆమోదానికి పంపవచ్చు. ఆర్థిక బిల్లులను వీటో చేసే అధికారం గవర్నర్‌కు లేదు. ఈ విషయమై విధానసభ తిరుగులేని ఆధిక్యతను కలిగి ఉంటుంది.
రాజ్యాంగ సవరణ
భారత రాజ్యాంగ సవరణ ప్రక్రియలో అనుసరించే మూడో పద్దతిలో రాష్ట్రాల ఆమోదం అంటే రాష్ట్ర శాసనసభల ఆమోదం. రాష్ట్ర శాసనసభల ఆమోదం అంటే విధానసభల ఆమోదంగానే పరిగణిస్తారు. విధాన పరిషత్‌కు సవరణ ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేదు.
ఎన్నికల విషయంలో
రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజిలో ఎమ్మెల్యేలు మాత్రమే సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు లేదు. రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నుకుంటారు. విధాన పరిషత్ సభ్యులను ఎన్నుకునే అధికారం ఎమ్మెల్యేలకు ఉంది. ఎంపీలను ఎన్నుకోగలిగే అవకాశం కూడా ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంటుంది.
విధాన పరిషత్ భవష్యత్తు నిర్ణయించేది విధానసభ
169వ అధికరణ ప్రకారం ఒక రాష్ట్రంలో విధాన పరిషత్‌ను ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా విధానసభ 2/3వ వంతు మెజార్టీతో చేసే తీర్మానం ముఖ్యమైంది. విధానసభ తీర్మానాన్ని అనుసరించే పార్లమెంట్ తీర్మానం చేస్తుంది. విధాన పరిషత్ భవిష్యత్తును నిర్ణయించేది విధానసభ.
విధాన పరిషత్ చైర్మన్లు
చైర్మన్లు పనిచేసిన కాలం
మాడపాటి హనుమంతరావు 1958-64
గొట్టిపాటి బ్రహ్మయ్య 1964-66
పి.రంగారెడ్డి 1968-72
తోట రామస్వామి 1972-74
నివర్తి వెంకటసుబ్బయ్య 1974-78
సయ్యద్ ముఖసిర్ షా 1979-80, 1981-85
ఎ.చక్రపాణి 2007-2014
స్వామిగౌడ్ 2014-2019
గుత్తా సుఖేందర్‌రెడ్డి 2019-22
గుత్తా సుఖేందర్‌రెడ్డి 2022, మార్చి నుంచి
విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్లు
డిప్యూటీ చైర్మన్లు పనిచేసినకాలం
జి.ఎన్.రాజు 1958-64
ఎం.ఆనందమ్ 1964-66
ఎ.సత్యనారాయణ 1969-70
సయ్యద్ ముఖసిర్షా 1970-79
కేశవరావు 1980-81
టి.పాంచజన్యం 1982-83
ఎ.చక్రపాణి 1983-85
మహమ్మద్ జాని 2007-11
నేతి విద్యాసాగర్‌రావు 2011-14
నేతి విద్యాసాగర్‌రావు 2014- 21
బండ ప్రకాష్ 2023, ఫిబ్రవరి నుంచి
విధాన పరిషత్ సభ్యులను ఎన్నుకొనే పద్ధతి
మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు మందిని రాష్ట్ర విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు. 1/3వ వంతు మందిని స్థానిక స్వపరిపాలనా సంస్థల ప్రతినిధులు ఎన్నుకుంటారు. 1/6వ వంతు మందిని గవర్నర్ నియమిస్తారు. 1/12వ వంతు మందిని రాష్ట్రాంలోని ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు. 1/12వ వంతు మందిని రాష్ట్రంలోని పట్టభద్రులు ఎన్నుకుంటారు.
లోక్‌సభ ఆమోదించి పంపిన సాధారణ బిల్లులపై రాజ్యసభ ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి.
రాజ్యసభ
సాధారణ బిల్లుల విషయంలో రాజ్యసభ, లోక్‌సభల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తితే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ సభ్యులు పాల్గొని ఓటు వేస్తారు.
రాజ్యాంగ సవరణ ప్రక్రియలో రాజ్యసభ పాల్గొంటుంది.
రాజ్యసభను రద్దు చేయడానికి అవకాశం లేదు. ఎప్పటికీ శాశ్వత సభగానే కొనసాగుతుంది.
విధానసభ ఆమోదించి పంపిన బిల్లులపై విధాన పరిషత్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి.
విధాన పరిషత్
సాధారణ బిల్లుల విషయంలో విధానసభ విధానపరిషత్ల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తితే ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి పాల్గొనడానికి విధాన పరిషత్‌కు అవకాశం లేదు.
రాజ్యాంగ సవరణ
ప్రక్రియలో పాల్గొనే అవకాశం విధానపరిషత్‌కు లేదు.విధాన పరిషత్‌ను పూర్తిగా లేకుండా రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది.