నిద్ర..ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత నిద్రపోతే అంత ఆరోగ్యం అనేది పెద్దలు చెబుతారు. ప్రశాంతమైన నిద్ర..శరీరంలోని అన్ని అవయవాలను సెట్ రైట్ చేస్తుంది. మంచి నిద్ర తర్వాత శరీరంలో ఉత్సాహం వస్తుంది కూడా.. అయితే ఏ వయస్సు వారు ఎంత నిద్ర పోవాలి అనే సందేహాలు ఉన్నాయి. అతి నిద్ర కూడా ప్రమాదకరమే అని చెబుతూ.. ఆయా వయస్సుల వారు కనీసం ఇంత సమయం నిద్రపోవాలని చెబుతున్నారు డాక్టర్లు. అదేంటో చూద్దామా..
- అప్పుడే పిల్లలు 12-18 గంటలు నిద్రపోవాలి.
- మూడు నుంచి 11 నెలల మధ్య పిల్లలకు 14-15గంటల నిద్ర అవసరం
- 1-3 వయసున్న పిల్లలు 12-14 గంటల సమయం నిద్ర తప్పనిసరి.
- 3నుంచి 5ఏళ్ల లోపు పిల్లలు తప్పనిసరిగా 11-13 గంటలు నిద్రపోవాలి
- 5నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలు 10-11 గంటలు సమయం నిద్రకు కేటాయించాలి.
- 11నుంచి 17 ఏళ్ల వయసు వారికి 8-9 గంటల నిద్ర అవసరం ఉంటుంది.
- 17 ఏళ్ల పైబడిన వారందరికి తప్పనిసరిగా 7-9 గంటల నిద్ర అవసరం అంటున్నారు డాక్టర్లు.