బుల్లి కారు వచ్చేస్తోంది : టాటా నానో ఎలక్ట్రిక్ కారు.. ధర, మైలేజ్ ఎంతంటే..!

బుల్లి కారు వచ్చేస్తోంది : టాటా నానో ఎలక్ట్రిక్ కారు.. ధర, మైలేజ్ ఎంతంటే..!

కార్ల ప్రపంచంలో టాటా నానో ఓ విప్లవం అని చెప్పాలి. లక్ష రూపాయల బేసిక్ ధరలోనే కారు అందించటం అనేది ఓ సంచలనం. నానో కారుకు ఆదరణ లేక పోవటంతో నిలిపివేసింది టాటా కంపెనీ. ఇప్పుడు మళ్లీ రీలాంఛ్ చేయాలని చూస్తుందని.. పూర్తి ఎలక్ట్రికల్ గా.. ఈవీగా తీసుకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు పోటెత్తుతున్నాయి. టాటా నానో ఎలక్ట్రికల్ కారు..2024 సంవత్సరం చివరి నాటికి రోడ్డెక్కబోతున్నదని.. ధర, మైలేజ్, ఫీచర్స్, కారు మోడల్ ఇలా ఉంటుం దం టూ కొన్ని వార్తలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఆ విశేషాలు ఇలా..

నానో ఎలక్ట్రికల్ కారు ఫీచర్స్ :

  • నాలుగు డోర్లు ఉంటాయి. 4 సీట్లు.
  • 17 kWh బ్యాటరీ
  • ఫుల్ ఛార్జింగ్ చేస్తే 200 నుంచి 220 కిలోమీటర్ల మైలేజ్
  • R12 profile టైర్లు
  • 2 ఎయిర్ బ్యాగ్స్
  • 3.3 kW, AC charger
  • మ్యూజిక్ సిస్టమ్
  • పార్కింగ్ సెన్సార్, రేర్ కెమెరాలు
  • ఫ్రంట్ పవర్ విండోస్

ఇలాంటి డీసెంట్ ఫీచర్స్ తో నానో ఎలక్ట్రికల్ కారును లాంఛ్ చేస్తుందంట టాటా. బేసిక్ ధర 5 లక్షల రూపాయలుగా ఉంటుందని ఆటోమొబైల్ మార్కెట్ వర్గాల సమాచారం. హైఎండ్ ఫీచర్స్ ధర 8 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా.

ప్రస్తుతం టాటా టియాగో ఈవీ వెహికల్ స్టార్టింగ్ ధర 8 లక్షల నుంచి 11.50 లక్షల రూపాయల వరకు ఉంది. టాటా టియాగో ఈవీ కార్ల అమ్మకాల్లో మంచి రెస్పాన్స్ రావటంతో.. టియాగో రేంజ్ కంటే తక్కువగా.. 10 లక్షల రూపాయలలోపు ధరలో.. నానో ఎలక్ట్రికల్ కారు తీసుకురాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ఎలక్ట్రికల్ చిన్న కార్ల రేంజ్ లో.. ప్రస్తుతం ఎంజీ ఎలక్ట్రికల్ కామెట్ కారు ఉంది. ఈ కారు ప్రారంభ ధర 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంది. ఇప్పుడు ఈ రేంజ్ లో నానోను తీసుకురావాలని టాటా భావిస్తుంది. 2024లోనే నానో ఈవీ రోడ్డెక్కుతుందా లేదా అనేది చూడాలి..