మన దేశంలో సుపరిపాలనకు పితామహుడు వాజ్‌పేయి. తన జీవితాంతం ఓటమికి బెదరని నిఖార్సయిన నాయకుడిగా నిలిచిన ఆయన.. అధికారం కోసం అడ్డదారులు తొక్కకుండా, అసత్య రాజకీయాలకు చోటివ్వకుండా రెండుసార్లు ప్రధాని పదవిని సైతం వదులుకున్నారు. భవిష్యత్‌ను ముందే ఊహించి ప్రధానిగా మహోన్నత నిర్ణయాలు, ఆదర్శభావాలతో దేశాన్ని ముందుకు నడిపించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎదురొడ్డి నిలిచిన యోధుడాయన. తన మంచితనంతో రాజకీయ ప్రత్యర్థులతోనూ అజాతశత్రువు అనిపించుకున్నారు.
మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో 1924 డిసెంబర్ 25న వాజ్‌పేయి జన్మించారు. గ్వాలియర్లోనే ప్రాథమిక విద్య నుంచి గ్రాడ్యుయేషన్ వరకూ చదివారు. కాన్పూర్ లోని డీఏవీ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ పూర్తి చేశారు. స్టూడెంట్‌గా ఉన్నప్పట్టి నుంచే ఆర్యసమాజం భావాలకు ప్రభావితమయ్యారు. 1939లో అంటే తన 16వ ఏట ఆర్ఎస్ఎస్‌లో చేరారు. 1944లో ఆర్యకుమార్సభ జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. 1947లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా మారారు. దేశ విభజన సందర్భంగా చెలరేగిన అల్లర్ల కారణంతో వాజ్‌పేయి లా డిగ్రీని మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత విస్తారక్‌గా ఉత్తరప్రదేశ్ వెళ్లారు. అక్కడ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేతృత్వంలో నడుస్తున్న రాష్ట్రధర్మ(హిందీ మంత్లీ), పాంచజన్య(హిందీ వీక్లీ)తో పాటు స్వదేశ్, వీర్ అర్జున్ డైలీల్లోనూ పనిచేశారు. 1951లో కొత్తగా ఏర్పడిన జనసంఘ్ లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయతో కలిసి చేరారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ ముఖ్య అనుచరునిగా ఎదిగారు. ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం కలిగిన వాజ్‌పేయి అనతికాలంలోనే సంఘ్ ముఖ్య నాయకుల్లో ఒకరిగా మారారు.
1957లో తొలిసారి పార్లమెంటుకు..
1957లో ఉత్తర ప్రదేశ్ లోని బలరాంపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1974లో ఎమఋర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం వాజ్‌పేయిని అరెస్ట్ చేసి 1977 వరకు జైల్లో ఉంచింది. ‘‘చీకటి రాత్రి విసిరిన సవాల్ ఇది. కిరణమే చివరి అస్త్రం అవుతుంది”అని జైలు నుంచే తన కవిత్వంతో ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 1980లో వాజ్‌పేయి ప్రెసిడెంట్‌గా భారతీయ జనతా పార్టీ ప్రాణం పోసుకుంది. ఈ రోజు ఆసేతు హిమాచలం అంత ఎత్తుకు బీజేపీ ఎదిగిందంటే దానికి దార్శనికుడు వాజ్పేయే. రెండు సీట్లే రావడంతో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదంటూ కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో చేసిన కామెంట్లపై వాజ్‌పేయి ఘాటుగానే స్పందించారు. ‘‘ఇప్పుడు బీజేపీ భంగపడి ఉండొచ్చు. కానీ, భవిష్యత్‌లో దేశమంతా కాషాయం విస్తరించే రోజు కచ్చితంగా వస్తుంది. ఆ రోజు కోసం ఎదురుచూస్తా”అని చెప్పడం ఆయన ముందు చూపుకు నిదర్శనం. ఆనాడు వాజపేయి చెప్పినట్టే ఈరోజు బీజేపీ దేశమంతటా విస్తరించగలిగింది.
దేశాభివృద్ధికి విప్లవాత్మక కార్యక్రమాలు
మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టిన వాజ్‌పేయి దేశాభివృద్ధి కోసం ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారు. రహదారులతోనే దేశాభివృద్ధి పరుగులు పెడుతుందని గుర్తించి స్వర్ణ చతుర్భుజి పథకం ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి గుజరాత్ వరకు ఈస్ట్– వెస్ట్ కారిడార్ గా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నార్త్-సౌత్ కారిడార్ గా దేశంలో వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన నగరాలను కలుపుతూ ఆరు వేల కిలోమీటర్ల వరకు హైవేలు నిర్మించారు. గ్రామీణ యువత పట్టణ ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడానికి, ఉద్యోగావకాశాలు పొందడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడింది. అలాగే గ్రామీణ ప్రాంతంలో రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులను పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకోవడానికి అవకాశం దక్కింది. అలాగే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా తారు రోడ్లు వేసి గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలతో అనుసంధానం చేశారు.
మొబైల్ విప్లవం అటల్జీ చలవే
వాజ్‌పేయి ప్రధానిగా ‘‘ఆపరేషన్ శక్తి” పేరుతో పోక్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించడం పెను సంచలనం సృష్టించింది. దీంతో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు మనపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్థిక సంక్షోభం అంచుల వరకు చేరుకున్న దేశాన్ని తన పాలనా దక్షతతో గాడిన పెట్టారు. 2001లో వాజ్‌పేయి ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్‌ను ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం అందరికీ ఉచిత, నిర్బంధ విద్యను కల్పించడం, ఆరేండ్ల నుంచి 14 ఏండ్లలోపు పిల్లలకు విద్యను ప్రాథమిక హక్కుగా చేయడం. దీని ద్వారా ఐదేండ్లలోనే స్కూల్ డ్రాప్ అవుట్ సంఖ్య 60 శాతానికి తగ్గింది. ప్రభుత్వాలు చేసే ఖర్చుల్లో నియంత్రణ తేవడానికి, ద్రవ్యలోటు తగ్గించడానికి 2003లో ఎఫ్ఆర్బీఎం చట్టం తెచ్చారు. ఈ చట్టం.. ప్రభుత్వ పొదుపును పెంచడమే కాక, ఆ నిధులను అభివృద్ధి పథకాలకు మళ్లించడానికి ఉపయోగపడింది. టెలికం రంగంతో ఆర్థికాభివృద్ధి ముడిపడి ఉందని కొత్త టెలికం విధానాన్ని తీసుకొచ్చారు. ప్రజల శ్రేయస్సే తన శ్రేయస్సుగా, దేశాభివృద్ధి, దేశ రక్షణ తన జీవిత లక్ష్యంగా భావించి ఆ దిశగా అడుగులు వేసి భవిష్యత్ తరాలకు దారి చూపిన మహోన్నత వ్యక్తి వాజ్ పేయి. – ఎన్.రామచంద్రరావు ఎమ్మెల్సీ, బీజేపీ.
ప్రత్యర్థులతోనూ అజాతశత్రువు అనిపించుకున్న మహోన్నతుడు అటల్జీ
- వెలుగు ఓపెన్ పేజ్
- December 25, 2020
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్‌కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?