Deepak Saroj: ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్న పిల్లాడిని గుర్తు పట్టారా..? ఇప్పుడెలా ఉన్నాడో తెలిస్తే షాక్ అవుతారు..

Deepak Saroj: ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్న పిల్లాడిని గుర్తు పట్టారా..? ఇప్పుడెలా ఉన్నాడో తెలిస్తే షాక్ అవుతారు..

Deepak Saroj: చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించి బుడిబుడి మాటలతో డైలాగులు చెబుతూ అలరించిన చిన్నారులు ఇప్పుడు పెరిగి పెద్దయి హీరోలుగా ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకుంటున్నారు. అయితే అతడు సినిమాలోని కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ చాలామందికి బాగానే గుర్తుంటాయి. 

ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కొడుకు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ ఇప్పటికీ బాగానే గుర్తుంటాడు. ఈ క్రమంలో అతడు సినిమాలో దీపక్ సరోజ్ నాన్న రైలు తెస్తానన్నావ్ కదా... తెచ్చావా అని బ్రమ్మి ని అడగ్గా తెచ్చా.. ప్లాట్ఫారం మీద ఉంది వెళ్ళి తెచ్చుకో అంటూ చెప్పే డైలాగ్స్ ఆడియన్స్ ని ఎంతగానో నవ్వించాయి.

చిన్నపుడు క్యూట్ డైలాగ్స్ తో అలరించిన దీపక్ సరోజ్ ఆర్య, అతడు, పెదబాబు, భద్ర, లెజెండ్ తదితర సినిమాలతోపాటూ మరిన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అయితే దీపక్ సరోజ్ ఇప్పుడు పెరిగిపెద్దవడంతో హీరోగా అదృష్టం పరీక్షించుకున్నాడు. ఈ క్రమంలో 2016లో టాలీవుడ్ డైరెక్టర్ కొప్పలపాటి శ్రీను దర్శకత్వం వహించిన "లవ్ K రన్" అనే సినిమాతో  హీరోగా పరిచయమయ్యాడు. 

ఆ తర్వాత ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు వై.యశశ్వి దర్శకత్వం వహించిన సిద్దార్థ్ రాయ్ అనే సినిమాలో హీరోగా నటించాడు. బోల్డ్ అండ్ రొమాంటిక్ డ్రామా జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాతో దీపక్ సూరజ్ యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకున్నాడు.

ప్రస్తుతం నూతన దర్శకుడు హరీష్ గదగాని దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో హీరోగా నటించే ఆఫర్ దక్కించుకున్నాడు. ఇటీవలే ఈ సినిమా ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈ సినిమాని శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై తన్నీరు హరిబాబు నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో దీపక్ సరోజ్ కి జంటగా దీక్షిక, అనైరా నటిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే పూర్తికాగా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుగుతోంది.

అయితే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన చిన్నారులు ఇప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి బాగానే రాణిస్తున్నారు. ఈ క్రమంలో తేజ సజ్జ(హనుమాన్), సంతోష్ శోభన్ (గోల్కొండ హై స్కూల్),  నిత్య శెట్టి(దేవుళ్ళు), రోషన్ మేక (రుద్రమదేవి) తదితరులు బాగానే రాణిస్తున్నారు.