ఎలక్ట్రిక్ బైకుల తయారీ కంపెనీ ఏథర్ తన కొత్త మోడల్ Ather 450 X సిరీస్ ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్స్ మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్, Magic Twist, TrueRange సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. ఏథర్ కొత్త మోడల్ బైకులు ఇందులో వివిధ వేరియంట్లు ఉన్నాయి. Ather 450 S, Ather 450X, Ather Apex వేరియంట్లలో లభిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
Ather Energy కంపెనీ తన 450 సిరీస్ పనితీరు, భద్రత అప్ గ్రేడ్ చేయబడింది. మల్లీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో హైలైట్. ఇది హై ఎండ్ మోటార్ సైకిళ్లలో కనిపించే ఫీచర్ ఇది. ఈ ఫీచర్ Ather 450X మూడు వేరియంట్లలో ను ఉంది.వర్షం,రోడ్ మోడ్, ర్యాలీ మోడ్, రైన్ మోడ్ కంట్రోల్ వీల్ ఉంటుంది.. MRF సహకారంతో అభివృద్ధి చేయబడిన మల్టీ-కాంపౌండ్ టైర్‌లు కూడా ఉన్నాయి. ఎటువంటి మోడల్ లలో అయినా సేఫ్ డ్రైవ్ చేయొచ్చు.
ఛార్జింగ్ రేంజ్..
- Ather 450X వేరియంట్ లో 3.7 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ చేస్తే 130 km వరకు ప్రయాణించొచ్చు.
- TrueRange 161 km IDCని అందిస్తోంది. 2.9 kWh బ్యాటరీతో వస్తున్న Ather 450X ఎలక్ట్రిక్ బైక్ ఒక్కసారి ఛార్జింగ్ తో 105 కిమీ వరకు ప్రయాణించవచ్చు.
- Ather 450 Apex 130 km వరకు ట్రూరేంజ్ 157 km IDC వరకు అందిస్తుంది.TrueRange 126 km IDC ని అందిస్తుంది.
- ఇక Atehr 450S బైక్ ను ఒకసారి ఛార్జింగ్ చేస్తే 105 km ప్రయాణించొచ్చు. ట్రూ రేజ్ 122 km IDC ఉంటుంది.
ధర..
- Ather 450 సిరీస్‌లో Ather 450S ధర రూ. 1లక్షా 29వేల 999
- Ather 450X 2.9 kWh వేరియంట్ ధర రూ.1లక్షా46వేల 999
- Ather 450X 3.7 kWh వేరియంట్ ధర రూ. 1లక్షా 56వేల 999 (అన్ని ధరలు బెంగళూరు ఎక్స్-షోరూమ్)తో కలిపి
- Ather 450 అపెక్స్ ధర రూ.1లక్షా99వేల 999 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, ప్రో ప్యాక్‌తో సహా)
- కొత్త మోడళ్ల కోసం బుకింగ్‌లు , టెస్ట్ రైడ్‌లు దేశవ్యాప్తంగా ఓపెన్ చేసి ఉన్నాయి.