ఎలక్ట్రానిక్ బైక్స్ లో ఏథర్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దాంట్లో ఉన్న ఫీచర్స్ వల్ల చాలామంది ఈ బైక్స్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బ్యాటరీ సేఫ్టీ, ఎమర్జెన్సీ అలర్ట్ లాంటి కొన్ని ప్రత్యేక ఫీచర్లని తీసుకొచ్చిన ఏథర్ ఇప్పుడు మరికొన్ని అప్ గ్రేడ్లని తీసుకొస్తుంది. ఏథర్ బైక్ లతో వాడుతున్న సాఫ్ట్ వేర్ కు అప్ గ్రేడ్ వెర్షన్ ‘ఏథర్ స్టాక్ 5.0’ ని కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.
ఈ కొత్త సాఫ్ట్ వేర్ ద్వారా గూగుల్ మ్యా్ప్స్ ను వాడుకునే వీలుంటుంది. అంతేకాకుండా ఏథర్ 450 సిరీస్ బండ్లను నాలుగు కొత్త కలర్స్ లో కూడా అందుబాటులోకి తెచ్చింది. సీటును మరింత కంఫర్టబుల్ గా మార్చింది. ఏథర్ కమ్యూనిటీ డే నాడు ఈ ఫీచర్లను లాంచ్ చేసింది. వీటి ధర మోడల్ ని బట్టి రూ. లక్ష 42 వేలనుంచి రూ.లక్ష 66 వేల వరకు ఉన్నాయి.