ఎలక్ట్రిక్ స్కూటర్ సంస్థ ఏథర్ తన ఫ్యామిలీ స్కూటర్ రిజ్టా ను శనివారం (ఏప్రిల్ 6) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త..ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
రిజ్టాలో అతిపెద్ద సీటుతో ప్రత్యేకమైన స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. సీటు కింద 34L+22ఫ్రాంక్ యాక్సెసరీ) స్పేస్ తో మరింత సౌకర్యంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఫ్యామిలీ స్కూటర్ లో రైడింగ్ సులభతరం చేసేందుకు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కొత్తగా పరిచయం చేశారు. స్కిడ్ కంట్రోల్, ఇది జారుడు ప్రదేశాల్లో ట్రాక్షన్ ను నిర్ధారించడానికి మోటార్ టార్క్ ను నియంత్రిస్తుంది. ఈ కొత్త రిజ్టా ధర, ఫీచర్లు, లభ్యత వంటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఏథర్ రిజ్టా స్పెసిఫకేషన్స్
ఏథర్ రిజ్టా DRLలు, ఇండికేటర్లతో సమాంతరంగా హెడ్ లైట్ క్లస్టర్ ను కలిగి ఉంటుంది. లైనప్ లోని అన్ని మోడల్ లు గరిష్టంగా 80kmph వేగం, 3.7 సెకన్లలో 40 kmph యాక్సిలరేషన్ తో గరిష్ట వేగాన్ని చేరుకుంటుంది. ఏథర్ 450 సిరీస్ తరహాలో ఈ ఎలక్ట్రిక్ వాహనం మ్యాజిక్ ట్విస్ట్, ఆటో హోల్డ్, రివర్స్ మోడ్ ను కూడా కలిగి ఉంటుంది.
ఈ స్కూటర్ లో Ather stack 6.0 కొత్త మొబైల్ యాప్, వాట్సాప్ ఆన్ డాష్ , పింగ్ మై స్కూటర్, లైవ్ లోకేషన్ షేరింగ్, కాల్స్ కు ఆటో రిప్లై, అలెక్సా వంటి కొత్త ఫీచర్లను అందిస్తుంది.
ఛార్జింగ్ విషయానికి వస్తే.. సీటు కింద మల్టీ పుల్ యూజింగ్ 18W ఛార్జర్ కూడా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. రిజ్టా ఈ ఫీచర్లతో పాటు ఫైండ్ మై స్కూటర్, ఫాల్ సేఫ్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, థెప్ట్ , టో డిటెక్ట్ లను అందిస్తుంది.
ఈ సిరీస్ లో Rizta S, Z(2.9 kwh బ్యాటరీ), Rizta Z(3.7kwh బ్యాటరీ) 350W ఏథర్ పోర్టబుల్ చార్జర్, 700 W ఏథర్ Duo చార్జర్ ను అందిస్తాయి. 2.9kwh బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ కు 6గంటల 40 నిమిషాలు పడుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 123 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. 3.7 kwh బ్యాటరీ (టాప్ మోడల్ లో ) 80 శాతం ఛార్జింగ్ కు 4గంటల 30 నిమిషాలు పడుతుంది. దీనిని ఫుల్ చేస్తే 160 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
ఏథర్ రిజ్టా ధర
కొత్త రిజ్టా రెండు మోడల్స్, మూడు వేరియంట్ లలో అందుబాటులో ఉంది. రిజ్టా S, రిజ్టా Z 2.9kwh బ్యాటరీతో , రిజ్టా Z 3.7kwh బ్యాటరీతో Ritza S(2.9 kwh) ధర రూ. 1,09,999లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర రిజ్టా Z(2.9kwh) ధర రూ. 1,24,999, రిజ్టా Z(3.7kwh) ధర రూ. 1,44,999(ఎక్స్ షోరూమ్ ధర)..బ్యాటరీకి ఐదేళ్ల వారంటీ, అన్ని వేరియంట్లు ఐదేళ్ల ఐచ్చిక వారంటీ ప్రోగ్రామ్ (ఏథర్ బ్యాటరీ ప్రొటెక్ట్) తో అందుబాటులో ఉన్నాయి.
స్కూటర్ తో పాటు కంపెనీ Ather Halo.స్మార్ట్ హెల్మెట్ కూడా ప్రకటించింది. ఇది హర్మాన్ కార్డాన్ ఆధారిత ఆడియో, Wear Detect టెక్నాలజీ, వైర్ లెస్ ఛార్జింగ్, Ather ChitChat, స్కూటర్ హ్యాండిల్ బార్ నుంచి మ్యూజిక్, కాల్ నియంత్రణలను కలిగి ఉంటుంది. HALO ప్రారంభ ధర రూ. 12,999 మాత్రమే.
It has safety for your loved ones, smarts to stay connected and space to carry it all.
— Ather Energy (@atherenergy) April 6, 2024
Make the #AtherRizta yours at an introductory price of ₹1,09,999 at https://t.co/2x9QLbOxox#Ather #FamilyScooter #NewLaunch pic.twitter.com/gYnr6R2mgf