బెంగళూరు ఎలక్ట్రిక్ బైక్ తయారీ కంపెనీ ఏథర్(Ather) తన 2024 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రిజ్టా పేరుతో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. 450 సిరీస్ వంటి స్పోర్టీ, యూత్ ఫుల్ మోడల్ కంటే భిన్నంగా కుటుంబ అవసరాలను కోసం ప్రత్యేకంగా ఏథర్ రిజ్టాను అందిస్తున్నామని కంపెనీ సీఈవో తరుణ్ మెహతా ప్రకటించారు.
మునపటి మోడల్ కంటే రిజ్టా పెద్దదిగాను, సౌకర్యవంతంగాను, భద్రతకు అధిక ప్రాధాన్యత నిచ్చే ఫీచర్లతో వస్తుందని చెపుతున్నారు. 2019 నుంచి రిజ్టా మోడల్ ను అభివృద్ధి చేస్తున్నామని ..కమ్యూనిటీ డే సెలబ్రేషన్ ఈవెంట్ అయిన ACDC24 రోజున లాంచ్ చేయనున్నట్లు తెలిపారు.
Ather Energy 12 శాతం వాటాతో భారత దేశపు మూడవ అతిపెద్ద ఈ-టు వీలర్ కంపెనీ. ఏథర్ రిజ్టా దాని బేస్ వేరియంట్ అయిన Ather 450 S కంటే పెద్దదిగా ఉండే అవకాశం ఉంది. దీని ధర రూ.1,10,000 నుంచి రూ. 1, 30,000 ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
రిజ్టా అనేది ఒక కుటుంబ స్కూటర్, ఇది EV మా కంపెనీ పేరును మార్కెట్లో నిలబెడుతుందని సీఈవో తరుణ్ మెహతా ఆశాభావం వ్యక్తం చేశారు. డిస్కౌంట్ల పరంగా TVS iQube, Hero Vida Vi Pro, బజాజ్ చేతక్ లు గట్టి పోటీదారు అయ్యే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.