KL Rahul: తండ్రైన కేఎల్ రాహుల్.. ఆడపిల్లకు జన్మనిచ్చిన అతియా శెట్టి

KL Rahul: తండ్రైన కేఎల్ రాహుల్.. ఆడపిల్లకు జన్మనిచ్చిన అతియా శెట్టి

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తండ్రయ్యాడు. అతని భార్య అతియా శెట్టి సోమవారం (మార్చి 24) ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాప పుట్టిన వెంటనే అతియా శెట్టి, కెఎల్ రాహుల్ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ శుభవార్త పంచుకున్నారు. అతియా శెట్టి గర్భధారణతో ఉన్న ఫోటోతో "ఓహ్, బేబీ" అనే పోస్ట్‌కు క్యాప్షన్ ఇస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫోటోలో అతియా సోఫాలో  కూర్చుని ఉండగా.. కెఎల్ రాహుల్ ఆమె ఒడిలో తల ఆనించి ఉన్నాడు.

ఈ వార్త తెలుసుకున్న వెంటనే సెలెబ్రిటీలు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలీవుడ్ నటి కియారా అద్వానీ, షానయా కపూర్ వెంటనే రెడ్ హార్ట్ ఎమోజీల వీరికి విషెష్ తెలిపారు. తరువాత టైగర్ ష్రాఫ్, అర్జున్ కపూర్, అదితి రావు హైదరి, ఆయేషా ష్రాఫ్, కృష్ణ ష్రాఫ్,రిద్ధిమా కపూర్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు.  సోమవారం (మార్చి 24) లక్నోతో జరుగుతున్న మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. 

2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రాహుల్ ను రూ. 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అనుభవం ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మీద ఢిల్లీ ఫ్రాంచైజీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. 2024 ఐపీఎల్ సీజన్ లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడిన కేఎల్ .. కెప్టెన్ గా జట్టును ప్లే ఆఫ్ కు చేర్చడంలో విఫలమయ్యాడు. దీంతో అతన్ని లక్నో రిటైన్ చేసుకోకుండా వదిలేసి బిగ్ షాక్ ఇచ్చింది.