హైదరాబాద్, వెలుగు: పారాలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి సీఎం రేవంత్ రెడ్డి రూ.కోటి చెక్కును అందజేశారు. కోచ్ కు రూ.10 లక్షల చెక్కును ఇచ్చారు.
దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.కోటి నగదు బహుమతి, వరంగల్ లో 500 గజాల స్థలం, కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఈ నెల 7న సీఎం అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో దీప్తి జీవాంజీ, కోచ్ కలిశారు.
ఈ సందర్భంగా వారికి సీఎం చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు.