
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఫోగాట్ 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో పోటీ పడగా.. ఆమె ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా అనర్హత వేటు వేశారు. దీని వెనుక కుట్ర దాగుందని వస్తున్న వార్తలను అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) ప్రెసిడెంట్ అడిల్లే సుమరివాలా తోసిపుచ్చారు.
ఈ సమస్య శరీర సాంకేతికతకు సంబంధించినదని, దానిని రాజకీయం చేయడం సరికాదని అథ్లెటిక్స్ బాడీ చీఫ్ అన్నారు. ఫోగాట్ 50 కిలోలకు మారడానికి ముందు 53 కిలోల విభాగంలో ఎప్పుడూ పాల్గొనేదని సుమరివాలా ధ్వజమెత్తారు.
"వినేశ్ ఫోగాట్ అనర్హత వేటు వెనుక కుట్ర లేదు. మీరు అధిక బరువుతో ఉంటే, అధిక బరువు కలిగి ఉంటారు. ఇది సాంకేతికత. ఆమె గతంలో హైయర్ కేటగిరీలో పోరాడుతూ ఉండేది. ఇప్పుడు 50 కిలోల విభాగంలో పోటీ పడేందుకు బరువును తగ్గించుకోవలసి వచ్చింది. అలాంటి సందర్భాలలో, 50 కిలోల మార్కును కోల్పోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అధిక బరువుకు సడలింపు లేదు.." అని సుమరివాలా చెప్పారు.
ఫోగాట్ మంగళవారం ఉదయం జరిగిన వెయిట్‌ఇన్‌లో 50 కిలోల విభాగంలో చేరిందని అథ్లెటిక్స్ బాడీ చీఫ్ చెప్పారు. అయితే, బుధవారం మధ్య రాత్రి ఫోగట్ అధిక బరువుతో ఉన్నట్లు గుర్తించారు. ఆమె బరువును 50 కిలోల కంటే తక్కువకు తీసుకురావడానికి వైద్య బృందం రాత్రంతా ప్రయత్నించిందని సుమరివాలా చెప్పారు.
"కోచ్‌లు, డాక్టర్లు ఫోగాట్ బరువు తగ్గించడానికి రాత్రంతా మేల్కొని ఉన్నారు. ఆహారం ఇవ్వలేదు. నీరు కూడా పరిమిత స్థాయిలో ఇచ్చారు. ఆవిరి స్నానం వంటి మార్గాలతో బరువు తగ్గించేందుకు ప్రయత్నించారు. ఆమెను పరిగెత్తించారు. ఇవన్నీ చేశాక ఉదయం ఆమె బరువును పరిశీలించినప్పుడు, కొన్ని గ్రాముల బరువుతో ఉన్నట్లు కనుగొనబడింది. ఆ తర్వాత, బరువు తగ్గడానికి వైద్యులు ఆమెకు 15 నిమిషాల సమయం ఇచ్చారు. అయినప్పటికీ, సాధ్యపడలేదు.." అని అథ్లెటిక్స్ బాడీ చీఫ్ అన్నారు.
గ్రేస్ పీరియడ్
ఫోగాట్‌కు ఎటువంటి గ్రేస్ పీరియడ్ మంజూరు చేయలేదని బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. అథ్లెట్ గాయపడితే మాత్రమే అలాంటి సడలింపు అనుమతించబడుతుందని సుమరివాలా అన్నారు.
"మునుపటి బౌట్‌లో ఎవరైనా గాయపడితే, గ్రేస్ పీరియడ్ మాత్రమే అనుమతించబడుతుంది. ఫోగాట్‌కు ఎలాంటి గాయం కాలేదు. గాయాన్ని నకిలీ చేసే అవకాశమూ లేదు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఎప్పటికీ అలా చేయదు.." అని ఆయన చెప్పుకొచ్చారు.