Paris olympics2024: బోల్ట్ కాదు ఫెమ్కీ బోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పారిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: అది 4x400 మీటర్ల  మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ రిలే  ఫైనల్‌‌‌‌. హీట్స్‌‌‌‌లోనే వరల్డ్ రికార్డు బ్రేక్‌‌‌‌ చేసిన అమెరికా టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో ముందుకెళ్తోంది. చివరి లెగ్‌‌‌‌లో యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ అథ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కైలిన్ బ్రౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందరికంటే ముందుంది. బ్రిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఆంబెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బెల్జియం అథ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవోవి బ్రోయెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు, మూడు స్థానాల్లో దూసుకెళ్తున్నారు. ఈ మూడు జట్లే పోడియంపై ఉంటాయని అంతా ఫిక్సయ్యారు. ఇంతలోనే ఓ మెరుపు వచ్చింది. ముందున్న ముగ్గురు ప్రత్యర్థులను దాటుకుంటూ మరో అమ్మాయి ముందుకొచ్చేసింది. రెప్పపాటులో ఎండ్‌‌‌‌లైన్ దాటేసింది. 

ఆమె పేరు ఫెమ్కీ బోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. తన మెరుపు వేగంతో నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ రిలే గోల్డ్ అందించిన ఫెమ్కీ ఓవర్‌‌నైట్ స్టార్ అయిపోయింది.  టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనీసం ఈ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా అర్హత సాధించలేకపోయిన డచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ టీమ్  ఈసారి ఫెమ్కీ బోల్‌ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో  ఫెక్కీ  చివరి లెగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పరుగెత్తింది. ఉసేన్‌ బోల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాదిరిగా చివరి క్షణాల్లో తన ముందున్న  ముగ్గురినీ దాటేస్తూ  అందరినీ ఆశ్చర్యపరిచింది.  దాంతో డచ్ టీమ్ 3:07.43సె టైమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలవగా.. యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ (3:07.74సె), బ్రిటన్ (3:08.01సె) రజతం, కాంస్యానికి పరిమితం అయ్యాయి.