ఢిల్లీ ప్రతిపక్ష నేతగా అతిశీ.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆప్ శాసనసభాపక్షం

ఢిల్లీ ప్రతిపక్ష నేతగా అతిశీ.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆప్ శాసనసభాపక్షం

న్యూఢిల్లీ: మాజీ సీఎం, ఆమ్​ఆద్మీ పార్టీ(ఆప్) నేత అతిశీ ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఆప్​నుంచి గెలిచిన 22 మంది ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమయ్యారు. కల్కాజీ స్థానం నుంచి ఎన్నికైన ఆతిశీ పేరును లీడర్​ఆఫ్​అపోజిషన్​(ఎల్​ఓపీ)గా ఎమ్మెల్యే సంజీవ్​ఝా ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన తొలి మహిళ ఆతిశీ కావడం గమనార్హం. ఈ సమావేశంలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు.