ATM నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

ATM  నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యూపీఐ, ఆన్లైన్ ట్రాన్జాక్షన్స్ ఎంత చేసినా.. చేతిలో క్యాష్ లేకుండా అన్ని సార్లు పని జరగదు. అందుకోసం ఏటీఎం ను వాడకుండా ఉండలేం. అందుకోసం ఏటీఎం ను వాడక తప్పని పరిస్థితి. అయితే  ATM  నుంచి డబ్బులు డ్రా  చేసేవారికి షాకింగ్ న్యూ స్ ఇవ్వనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునే కస్టమర్స్ పైన ఫీజులు పెంచే యోచనలో ఉంది. 

కస్టమర్లు లిమిట్ దాటిన తర్వాత చేసే ప్రతి ట్రాన్జాక్షన్ పై చార్జీలు పెంచాలని నిర్ణయించింది ఆర్బీఐ. అదేవిధంగా ఇతర బ్యాంకు ఏటీఎంలలో డ్రా చేస్తే ఫీజు వాయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇదే జరిగితే ఎటీఎం విత్ డ్రా చేసిన ఎమౌంట్ పై మరిన్ని చార్జీలు కస్టమర్స్ జేబులో నుంచి కట్టాల్సి వస్తుంది. 

విత్ డ్రా ఫీజులు ఎంత పెంచనున్నారు?

ఇప్పటి వరకు ఏటీఎం విత్ డ్రా ఫీజు ఒక్క ట్రాన్జాక్షన్ కు రూ.21 గా ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ ఫీజులను పెంచాలని రెకమెండ్ చేసింది. దీనిప్రకారం 5 ఫ్రీ విత్ డ్రా లిమిట్ (5 ఫ్రీ విత్ డ్రా) తర్వాత ప్రతి ట్రాన్జాక్షన్ కు రూ. 22 గా పెంచేందుకు అనుమతి ఇచ్చింది. అదే విధంగా ఇతర బ్యాంకు ఏటీఎం ల నుంచి విత్ డ్రా చేస్తే (ఇంటర్ చేంజ్ ఫీజులు) ఒక్క విత్ డ్రాకు రూ.17 చార్జ్ చేసేవారు. ఇకనుంచి రూ.19 పెంచేందుకు అనుమతించింది. నాన్-క్యాష్ ట్రాన్జాక్షన్స్ కు రూ.6 నుంచి రూ.7కు పెంచుకోవచ్చునని రెకమెండ్ చేసింది. 

NPCI పర్మిషన్ ఇవ్వడంతో వెంటనే చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి బ్యాంకులు. వీలైనంత తర్వగా పెంపును అమలు చేయనున్నాయి. కస్టమర్లు 5 ఫ్రీ విత్ డ్రా లిమిట్ పూర్తైతే.. పెంచిన చార్జీలను భరించాల్సి ఉంటుంది.