బీదర్ లో రాబరీ జరిగింది. బ్యాంక్ నుంచి ఏటీఎంల్లో డబ్బు నింపటానికి వెళుతున్న వ్యాన్ పై ఎటాక్ చేశారు దుండగులు. ఇద్దరిని చంపి మరీ.. 90 లక్షల రూపాయలు దోచుకున్న ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ రాబరీ పూర్తి వివరాల్లోకి వెళితే..
బీదర్ సిటీ మెయిన్ రోడ్డులోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. SBI మెయిన్ బ్రాంచ్ ఉంది. 2025, జనవరి 16వ తేదీ ఉదయం బ్యాంక్ ఏటీఎంల్లో డబ్బు నింపేందుకు సీఎంఎస్ ఏజెన్సీకి చెందిన ప్రైవేట్ కంపెనీ సిబ్బంది ప్రత్యేక వాహనంలో బ్యాంక్ నుంచి బయలుదేరింది. శివాజీచౌక్ ఏరియాలోని ATM సెంటర్ లో లో డబ్బు పెట్టటానికి అంతా సిద్ధం అయ్యారు. ఆ సమయంలో.. ఇద్దరు ముసుగు దొంగలు హఠాత్తుగా ఎటాక్ చేశారు.
Also Read :- వెన్నెముక నుంచి కత్తి మొన తీసిన డాక్టర్లు..
సిబ్బంది కళ్లల్లో సాల్ట్ పౌడర్.. ఉప్పు పొడి కొట్టారు.. ఆ వెంటనే కాల్పులు జరిపారు. ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ వెంటనే 90 లక్షల రూపాయల డబ్బు ఉన్న పెట్టెతో అక్కడి నుంచి బైక్ పై పారిపోయారు.
ఈ ఘటనలో మేనేజర్ గిరి వెంకటేష్, సెక్యూరిటీ గార్డు శివకుమార్ చనిపోయారు. ఈ ఘటనతో అప్రమత్తం అయిన స్థానికులు సైతం దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. బైక్ పై వెళుతున్న వాళ్లపై రాళ్లు రువ్వినట్లు చెబుతున్నారు స్థానికులు. ఈ దోపిడీపై బీదర్ ఎస్పీ స్పందించారు. నిందితులను పట్టుకుంటామని.. కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు.