ఏటీఎంను ధ్వంసం చేసి రూ.23 లక్షలు చోరీ.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన

ఏటీఎంను ధ్వంసం చేసి రూ.23 లక్షలు చోరీ.. నల్గొండ జిల్లా దామరచర్లలో ఘటన

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా దామరచర్లలోని అద్దంకి–నార్కట్ పల్లి హైవే సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 23 లక్షలను ఎత్తుకెళ్లారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల సెంటర్  సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో బ్యాంకు సిబ్బంది శుక్రవారం సాయంత్రం రూ.16 లక్షల నగదును జమ చేశారు. అప్పటికే అందులో ఉన్న రూ.7 లక్షల నగదుతో కలిపి రూ.23 లక్షలు ఉన్నాయి.

ఏటీఎంలోకి వెళ్లిన దొంగలు.. సీసీ కెమెరాలకు నల్లటి రంగు పూసి, అలారం వైర్​ కట్ చేసి ఏటీఎం మెషీన్  డోర్  తెరిచారు. క్యాష్  నిలువ చేసిన లోపలి మెషీన్​ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి నగదును ఎత్తుకెళ్లారు. ఆనవాళ్లు దొరకకుండా పెప్పర్  స్ప్రే వాడినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం రావడంతో ఎస్పీ శరత్ చంద్ర  పవర్,  డీఎస్పీ రాజశేఖర రాజు, రూరల్  సీఐ కె వీరబాబు అక్కడికి చేరుకున్నారు. నల్గొండ నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ లను రప్పించి  ఆధారాలు సేకరించారు.