
సుబ్బరాజు, వీజే సన్నీ లీడ్ రోల్స్‌లో చంద్రమోహన్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఏటీఎం’. హరీష్ శంకర్ కథను అందించాడు. దిల్ రాజు సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత కలిసి నిర్మించారు. జనవరి 20 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. బుధవారం ట్రైలర్‌ను లాంచ్ చేశారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘ఏటీఎం రాబరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. చంద్రమోహన్ అద్భుతంగా తీశాడు. ఈ వెబ్ సిరీస్ క్రెడిట్ అంతా అతనికే దక్కుతుంది. సన్నీకి పర్పెక్ట్ మాస్ హీరో అయ్యే అవకాశం ఉంది. సుబ్బరాజు, షఫీ, దివి, రోయల్, రవి రాజ్, కృష్ణ చక్కగా నటించారు’ అన్నాడు.
‘లైఫ్ టైమ్ గుర్తుండిపోయే పాత్ర చేశా’ అన్నాడు సన్నీ. ‘దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో వర్క్ చేయడం హ్యాపీ. హరీష్ శంకర్ మా వెనుక ఉన్నారనే ధైర్యం మమ్మల్ని నడిపించింది’ అన్నాడు దర్శకుడు. ‘ఈతరం ప్రేక్షకులు కోరుకునే ప్రాజెక్టులు తెరకెక్కించాలనే దిల్ రాజు ప్రొడక్షన్స్‌ని ప్రారంభించాం’ అన్నారు నిర్మాతలు హన్షిత, హర్షిత్ రెడ్డి. సుబ్బరాజు, షఫీ, దివి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారి, జీ 5 కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ దేశ సాయితేజ్ పాల్గొన్నారు.