వీడియో: పానీ పూరీ కోసం ఏటీఎం

నోట్లు పెడితే చాలు పానీ పూరీ వచ్చేస్తుంది..
ట్విటర్‌‌లో వీడియో పోస్ట్ చేసిన అసోం డీజీపీ
కరోనా కాలంలో పానీ పూరీ లవర్స్‌కు తీపికబురు

న్యూఢిల్లీ: పానీ పూరీ అంటే నోరూరని వారు ఎవరుండరు చెప్పండి.. అంత ఇష్టం అందరికీ. వీధికో పానీపూరీ బండి అయినా ఉండాల్సిందే. కానీ కరోనావైరస్ మహిమతో రోడ్డుపై ఒక్క పానీ పూరీ బండి కనిపించడం లేదు. ఒక్కరు కూడా రోడ్డుపై పానీపూరీ తినడానికి మొగ్గు చూపడం లేదు. చాలా వరకు రోడ్డుపై దొరికే తినుబండారాలు మూతపడ్డాయి. ఈ సమయంలో పానీపూరి లవర్స్ మస్తుఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ కరోనావైరస్ వెళ్లిపోతుందో.. మళ్లీ రోడ్డుపై ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ పానీపూరి తినాలో అని తెగ వెయిట్‌‌ చేస్తున్నారు. ఇలాంటి వారి కోసమే ‘పానీపూరీ ఏటీఎం’ పుట్టుకొచ్చింది. ఈ కాంటాక్ట్‌లెస్ ‌పానీపూరీ వెండింగ్ మిషన్ ప్రస్తుతం ఫుల్ పాపులారిటీ దక్కించుకుంటోంది. డైరెక్టర్‌ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) అసోం, హర్ది సింగ్ ట్విట్టర్ లో షేరు చేసిన ఈవీడియో మస్తు వైరల్ అవుతోంది. ‘ఇదీ నిజమైన భారతీయుని నైపుణ్యం’ అంటూ హర్ది సింగ్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఏటీఎం లాంటి ఈ వెండింగ్ మిషన్‌‌ను ఎలా వాడాలో దీన్ని రూపొందించిన భరత్ భాయ్ ప్రజాపతి వివరించాడు. మనకు ఎన్ని రూపాయలకు పానీపూరీ కావాలో ముందుగా సెలక్ట్ చేసుకోవాలి.. ఆ తర్వాత కింద ఇచ్చిన స్లాట్‌‌లో కరెన్సీ నోట్లు పెట్టాలి. అలా పెట్టిన తర్వాత మిషన్ ఓపెన్ అయి, పానీపూరి ఒక దాని తర్వాత ఒకటి రావడం మొదలవుతుంది. ఈ మిషన్‌‌ను రెడీ చేయడానికి ఆరు నెలల టైమ్ పట్టినట్టు ప్రజాపతి చెప్పాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ వెండింగ్ మిషన్ తయారు చేసిన భరత్ భాయ్ ప్రజాపతి చదువుకున్నది కేవలం పదవతరగతే. గుజరాత్‌‌లోని బనసకాంత జిల్లా దీసా తాలూకా రవైనా గ్రామానికి చెందిన వాడు. కరోనా వైరస్‌‌తో సోషల్ డిస్టెన్సింగ్, కాంటాక్ట్‌లెస్ అనేది తప్పనిసరి అయింది. ఈ సమయంలో ఈ వెండింగ్ మిషన్‌‌తో పానీపూరీ లవర్స్‌‌కు కాస్త ఊరట దొరికినట్లవుతోంది.

For More News..

దుకాణాలు, సూపర్ జజార్లలో ఎక్స్ పైరీ ఫుడ్ ఐటమ్స్

కరోనా డేంజర్లో హైదరాబాద్

ప్రైవేటు ల్యాబుల్లో తప్పుడు రిజల్ట్స్