ఆత్మనిర్భర్ బలహీనపడొద్దు: రంగరాజన్‌‌‌‌‌‌‌‌

ఆత్మనిర్భర్ బలహీనపడొద్దు: రంగరాజన్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: దిగుమతులను లోకల్ కంపెనీలు  అసమర్ధవంతంగా భర్తీ చేయొద్దని,  ఆత్మనిర్భర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ స్టేజ్‌‌‌‌‌‌‌‌కి దిగజారొద్దని మాజీ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీ రంగరాజన్ పేర్కొన్నారు. పెట్టుబడులను పెంచడం,  అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌, మాన్యుఫాక్చరింగ్‌‌‌‌‌‌‌‌, సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్లకు ప్రాధాన్యం ఇవ్వడం, ఉద్యోగాలు ఎక్కువగా క్రియేట్ చేసే సెక్టార్లను ప్రమోట్ చేయడం వంటి విధానాలు ఫాలో అయ్యి డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ స్ట్రాటజీని క్రియేట్ చేయాలని ఆయన సలహా ఇచ్చారు. 

 దిగుమతులను లోకల్ ప్రొడక్ట్‌‌‌‌లతో భర్తీ చేయడాన్ని  జాగ్రత్తగా అమలు చేయాలని, ఖర్చుల భారం ఎక్కువగా ఉంటే  ఈ విధానం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని ఐసీఎఫ్‌‌‌‌‌‌‌‌ఏఐ ఫౌండేషన్ 14 వ కాన్వకేషన్‌‌‌‌‌‌‌‌లో ఆయన పేర్కొన్నారు.  కొత్తగా అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ పాత విధానాలకు భిన్నంగా ఉండాలన్నారు. గ్రోత్ లేకుండా జాబ్ క్రియేషన్ ఆందోళన చెందించే అంశమని అన్నారు. కొత్త టెక్నాలజీలను మరిచిపోవద్దని సలహా ఇచ్చారు.