పొద్దంతా మనమే కనిపిస్తున్నం.. మనకే ఓట్లు ఏస్తరు

ఎమ్మెల్సీ కవిత మాక్లూర్ పర్యటనకు వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె..22 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పని చేస్తోందన్నారు. పార్టీ కోసం ఎంతోమంది కార్యకర్తలు తమ జీవితాలను త్యాగం చేశారన్నారు కవిత. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ జెండాలు, కార్యకర్తలే కనపడుతున్నారన్న ఆమె పొద్దంతా మనమే కనపడుతున్నాం.. మళ్లీ  బీఆర్ఎస్ కే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఒకప్పుడు గులాబీ కండువా కప్పుకుంటే ఎగతాళి చేసిన వారు ఇప్పుడు ఆ కండువా కప్పుకోడానికి ఎగబడుతున్నారన్నారు. కార్యకర్తల త్యాగ ఫలితంగా కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతోందన్నారు. పదవులు రాలేదని కార్యకర్తలు నిరాశపడవద్దన్న ఆమె.. కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని కవిత కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఆర్మూర్ లో జీవన్ రెడ్డి గెలుస్తారన్న కవిత.. ఆయనపై పోటీకి దిగే వారు ఆశలు వదులుకోవాలన్నారు.